18 రోజులైనా రికార్డుల వేటను తగ్గించని దేవర.. సరికొత్త రికార్డుతో టాలీవుడ్ మూవీలకు కొత్త టార్గెట్..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే విడుదల అయిన 18 వ రోజు అత్యధిక కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన సినిమాల లిస్టులో దేవర ఈ మూవీ అదిరిపోయే రేంజ్ ప్లేస్ లో నిలిచింది. మరి ఈ సినిమా విడుదల అయిన 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఏ ప్లేస్ లో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా విడుదల అయిన 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.84 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 వ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా 2.60 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలవగా , ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 1 సినిమా 1.45 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఇక మహేష్ బాబు హీరోగా రూపొందిన మహర్షి సినిమా 1.40 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో నిలవగా , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ 1.37 కోట్ల కలెక్షన్లతో 5వ స్థానంలో నిలిచింది. ఇకపోతే దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: