యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంత ఇచ్చిన కొత్తలో కాస్త లావుగా ఉండేవాడు. ఇక లావుగా ఉన్నా కూడా తన నటన తో , డాన్స్ తో ప్రేక్షకులను అలరించిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ , ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో మొదటగా స్టూడెంట్ నెంబర్ 1 అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో సింహాద్రి అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత వీరి కాంబోలో మూడవ సినిమాగా యమదొంగ సినిమా వచ్చింది. ఇది కూడా మంచి విజయం అందుకుంది. యమదొంగ సినిమా మొదలు కాకముందు రాజమౌళి , జూనియర్ ఎన్టీఆర్ తో నువ్వు ఈ సినిమా కోసం కచ్చితంగా బరువు తగ్గాలి అని అన్నాడట. దానితో రాజమౌళి ఎందుకు ఇప్పుడు బాగానే ఉంది కదా నేను సినిమాలు చేస్తున్నాను అందరూ బాగానే చూస్తున్నారు కదా అన్నాడట. దానితో రాజమౌళి నువ్వు సినిమాలు చేస్తున్నావు ... వారు చూస్తున్నారు. కానీ నువ్వు ఇలా ఉంటే యంగ్ ఏజ్ అమ్మాయిలకి నీ సినిమాలు పెద్దగా నచ్చవు. అలాగే కొంత మంది యూత్ కూడా నీ సినిమాలు చూసే అవకాశం తక్కువ అవుతుంది. నువ్వు కచ్చితంగా బరువు తగ్గాల్సిందే అని అన్నాడట.
దానితో వెంటనే ఆయన బరువు తగ్గే పనిలో పడి యమదొంగ సినిమా స్టార్ట్ అయ్యే లోపు బరువు తగ్గాడట. అలా రాజమౌళి "యమదొంగ" సినిమా కోసం బరువు తగ్గాలి అని సూచించడంతో ముందు కాస్త వెనక ముందు అయినా ఆ తర్వాత మాత్రం జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గినట్లు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే యమదొంగ సినిమా కోసం బరువు తగ్గిన జూనియర్ ఎన్టీఆర్ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా లావు కాకుండా తక్కువ బరువు తోనే బాడీ నీ మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.