టాలీవుడ్ : భార్య‌, భ‌ర్త‌.. ఇద్ద‌రు పిల్ల‌లు సినిమా కెళితే రు. 3 వేలు వ‌ద‌లాల్సిందే..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం ఒక పేదవాడి ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ లో మొదటగా నిలిచేది సినిమా. ఎందుకు అంటే వారం మొత్తం పని చేసే అలసిపోయిన ఇంటి పెద్ద అతని కుటుంబంతో కలిసి అతి తక్కువ ఖర్చుతో ఏదైనా సమయం గడిపే ఆప్షన్ ఉంది అంటే అది సినిమా అని నమ్మేవాడు. ఎందుకు అంటే కుటుంబం అంతా కలిసి సినిమాకు వెళ్లి సినిమా చూసి వచ్చిన కానీ రెండు , మూడు వందల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయ్యేవి కాదు. ఒక పేద , మధ్య తరగతి వ్యక్తి వారం మొత్తం పని చేసి తన కుటుంబంతో వారం చివరన ఒక సినిమా చూసి సమయాన్ని సరదాగా గడపాలి అనుకునేవాడు. కానీ ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితులు సగటు పేద సినిమా అభిమానికి లేకుండా పోయాయి అని జనాలు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకు అంటే దానికి ప్రధాన కారణం టికెట్ ధరల పెంపే అని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం టికెట్ ధరలతో ఇప్పటి టికెట్ ధరలను పోల్చి చూస్తే అసలు పొంతన లేకుండా పోయింది అని , ఒక పేద వ్యక్తి తన కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలి అంటే కనీసంలో కనీసం మూడు , వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సి ఉంది అని , ఇక అతను నెల అంతా కష్టపడి సంపాదించిన దాంట్లో నెలలో రెండు సినిమాలు చూస్తూనే మొత్తం ఖర్చు అయిపోతుంది అనే వాదనను కూడా జనాలు వ్యక్తం చేస్తున్నారు.

దానితోనే సినిమాను కుటుంబంతో కలిసి చూడాలి అంటే చాలా మంది పేదవాళ్లు భయపడుతున్నారు అని , ఇంతకు ముందు కుటుంబం మొత్తం కలిసి వారానికి ఒక సినిమా చూడాలి అనుకున్న వారు ఇప్పుడు సినిమా థియేటర్ వైపే చూడాలి అంటే భయపడిపోతున్నారు అని కూడా కొంత మంది జనాలు చెబుతూ వస్తున్నారు. ఇక సినిమా టికెట్ ధరలు తగ్గిస్తేనే కుటుంబం అంతా కలిసి థియేటర్కు వచ్చే అవకాశాలు ఉంటాయి అని మరి కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: