టాలీవుడ్ : లాభాల్లో వాటా సిస్ట‌మ్ అయితేనే హీరోలు దిగొస్తారు..?

Divya
•హీరో లకు నో రెమ్యూనరేషన్..
•వాటా పద్ధతి అయితేనే కంటెంట్ లో క్వాలిటీ
•టాలీవుడ్ లో ఈ పద్ధతి అమలు అయితే నిర్మాతలు కూడా సేఫ్..

హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు అనేవి.. నిర్మాతలు చేస్తున్న తప్పుగానే చెప్పాలి..ఎంత విచిత్రం అంటే 10 డిజాస్టర్ సినిమాలు ఇచ్చిన హీరోకు కూడా రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ అతనితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు అంటే నిర్మాతలు సినిమా రంగం మీద ఎంత మోజుతో ఎంత వేలం వెర్రిగా ఉంటున్నారో తెలుస్తోంది. హీరోలకు కానీ దర్శకులకు కానీ రెమ్యూనరేషన్లు ఇచ్చినంత కాలం వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు. సినిమా ఆడినా..  ఫ్లాప్ అయినా  నిర్మాతతో పాటు సినిమా కొన్నవారు దారుణంగా నష్టపోతారు. దీనివల్ల హీరోకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు.

హీరో రెమ్యూనరేషన్ హీరోకు వచ్చేస్తుంది.  రెమ్యూనరేషన్ పద్ధతి పోయి లాభాల్లో వాటా పద్ధతి పెడితేనే హీరోలు నేల మీదకు దిగి వస్తారు.  అప్పుడు కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయితేనే హీరోకు లాభం వస్తుంది. లేకపోతే హీరోకు కూడా రెమ్యూనరేషన్ ఉండదు. అలాంటి పద్ధతి టాలీవుడ్ లో వస్తే తప్ప హీరోలు ఇప్పట్లో దిగివచ్చే పరిస్థితి లేదు. ఇలా చేయాలి అంటే నిర్మాతలు అందరూ ఒకే మాట మీదకు వచ్చి హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు ఇవ్వకుండా కేవలం లాభాల్లో వాటా ఇవ్వాలి.

అప్పుడే సినిమా క్వాంటిటీ పైన కాకుండా కంటెంట్ పైన ఫోకస్ చేస్తారు.  నిజానికి క్వాలిటీ కలిగిన కంటెంట్ ఇవ్వగలిగితేనే ఆ హీరో సక్సెస్ అవుతారనడం లో సందేహం లేదు.  కానీ ఈ మధ్యకాలంలో డబ్బుకు ఆశపడి కథతో సంబంధం లేకుండా వరుగసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కానీ వేల రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  ఇక ఆడియన్స్ కు కావాల్సిన సరైన సినిమా దొరకాలి అంటే హీరోలు కూడా దిగి రావాల్సిందే. అందుకే రెమ్యూనరేషన్ కి బదులు వాటా పద్ధతి టాలీవుడ్ ఇండస్ట్రీలో అమలులోకి వస్తే ఖచ్చితంగా హీరోలు క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన ఆధారపడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: