టాలీవుడ్ : పేదోడి అభిమానంపై బాదుడు.. ఆ బెనిఫిట్ షోల దోపిడీ అన్ని కోట్లా?
ఆ సినిమాకు కొన్ని థియేటర్లలో అధికారికంగా మరికొన్ని థియేటర్లలో అనధికారికంగా బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. ఆ సినిమా టికెట్లను అభిమానులు 600 రూపాయల నుంచి 1300 రూపాయల వరకు కొనుగోలు చేశారు. ప్రముఖ టికెటింగ్ యాప్స్ లో ఆ షోలకు సంబంధించిన సమాచారం ఏ మాత్రం లేదు. అలా అని పెంచిన టికెట్ రేట్ల ట్యాక్స్ ప్రభుత్వాలకు సక్రమంగా చేరిందా అనే ప్రశ్నకు మాత్రం సరైన జవాబు లేదు.
పేదోడి అభిమానంపై బాదుడుతో ఏకంగా కేవలం బెనిఫిట్ షోలతోనే 50 కోట్ల రూపాయల మేర గ్రాస్ కలెక్షన్లు దోచేశారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఒక సినిమా కోసం 1500 రూపాయలు ఖర్చు చేయడం కూడా సాధారణ విషయం అయితే కాదని చెప్పవచ్చు. ఇప్పటికీ నెలకు 5000 రూపాయల నుంచి 7000 రూపాయల వేతనంతో జీవనం సాగించే కుటుంబాలు ఉన్నాయి.
అలాంటి కుటుంబాలు టికెట్ల కోసం 1000 రూపాయలు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు పెద్ద సినిమాలకు కోట్ల సంఖ్యలో ఫుట్ ఫాల్స్ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య కోటిని క్రాస్ చేయడం లేదు. టికెట్ రేట్లు ఎంత పెంచినా 2017లో విడుదలైన బాహుబలి2 సినిమా కలెక్షన్లను మరే సినిమా బ్రేక్ చేయలేదు. నిర్మాతలు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులు కరువు అవుతారని చెప్పవచ్చు.