బాలయ్యా మజాకా..ఒక్క హీరోయిన్ తో ఏకంగా 17 సినిమాలు..!

Pandrala Sravanthi
 -విజయశాంతితో బాలయ్య హిట్ పెయిర్..
- 17 సినిమాల్లో ఒక్కటే ప్లాఫ్ మిగతావన్నీ బ్లాక్ బస్టర్..

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ ఎంతోమంది హీరోయిన్లతో తెరను పంచుకున్నారు. ఇందులో ఆయనతో హిట్ కాంబో గా నిలిచింది ఒకే ఒక్క హీరోయిన్  విజయశాంతి. వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా 17 సినిమాలు వచ్చాయి. ఇందులో 90% హిట్ అయ్యాయి.  మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు ఆ ఏంటి.. అందులో హిట్ అయినవి ఎన్ని ఆ వివరాలు ఏంటో చూద్దాం..

  90స్ లో  బాలకృష్ణ  విజయశాంతి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే అభిమానులకు ప్రొడ్యూసర్లకు ఎంతో ఆనందం. తప్పక ఈ చిత్రం హిట్ అవుతుందనే భావన వారిలో ఉండేది. అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి మొదటి సినిమా కథానాయకుడు. మురళీమోహన్ రావు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం చిత్రం సూపర్ హిట్ అయింది.  ఆ తర్వాత వచ్చినటువంటి మూవీ పట్టాభిషేకం. టీ రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ  యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత ముద్దుల కృష్ణయ్య తో తెరపై కనిపించారు.  ఈ చిత్రానికి కోడి రామకృష్ణ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా రిజల్ట్ కూడా బ్లాక్ బాస్టరే..మరో చిత్రం దేశోద్ధారకుడు. ఎస్ఎస్ రవిచంద్ర డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అపూర్వ సహోదరులు. కే రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కూడా  సూపర్ హిట్ అయింది. 1985లో రిలీజ్ అయిన భార్గవ రాముడు సినిమాను కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేశారు. ఈ మూవీ రిజల్ట్ యావరేజ్ గా నిలిచింది. సాహస సామ్రాట్ దీన్ని కూడా రాఘవేంద్రరావే దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన మూవీ భానుమతి గారి మొగుడు. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. మరో మూవీ మువ్వా గోపాలుడు. 

కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ  బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. మరో చిత్రం ఇన్స్పెక్టర్ ప్రతాప్. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. భలే దొంగ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ  హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన మూవీ ముద్దుల మామయ్య. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో మరోసారి వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. ముద్దుల మేనల్లుడు.. కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన మరో మూవీ తమిళ చిత్ర రీమేక్ గా వచ్చింది. కానీ యావరేజ్ గా నిలిచింది. దీని తర్వాత వచ్చిన మరో మూవీ లారీ డ్రైవర్. బి.గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీని తర్వాత వచ్చిన చిత్రం తల్లిదండ్రులు. దీన్ని తాతినేని రామారావు డైరెక్షన్ చేశారు. ఇది కూడా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ తో మన ముందుకు వచ్చారు. బి.గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ   బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీని తర్వాత వచ్చినటువంటి చివరి మూవీ నిప్పు రవ్వ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. కానీ ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఈ విధంగా బాలకృష్ణ విజయశాంతి కాంబోలో వచ్చినటువంటి 17 చిత్రాల్లో 16 చిత్రాలు హిట్ యావరేజ్ గా నిలిస్తే ఒక్క సినిమా మాత్రమే ప్లాప్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: