ఓటిటిలో తిరుగులేకుండా దూసుకుపోతున్న బోల్డ్ వెబ్ మూవీస్.. ఏకంగా అన్ని వ్యూస్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమలలో హెబ్బా పటేల్ ఒకరు. ఇప్పటివరకు ఈ బ్యూటీ ఎన్నో తెలుగు సినిమాలలో నటించింది. అందులో కొన్ని మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ ఇప్పటివరకు చాలా సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులకు హిట్ పెంచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్ ప్రెస్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రస్తుతం ఆహా ఓ టీ టీ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టీ టీ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ రెండు ఓ టి టి ప్లాట్ ఫామ్ లలో కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఏకంగా ఈ సినిమాకు 70 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దక్కినట్లు తెలుస్తోంది. అలాగే ఆహా ఓ టీ టీ లో కూడా ఈ సినిమా ట్రేండింగ్లో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో చైతన్య రావు హీరోగా నటించగా ... హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందింది. బాల రాజశేఖరుని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ప్రేమ , పెళ్లి ఆ తర్వాత విడాకులు అనే అంశాల పరంగా నవతరం ఆలోచనలు అభిప్రాయాలతో ఈ సినిమా రూపొందింది. శృంగారపరమైన విషయాల్లో ఎదుర్కొనే సమస్యలను బోల్డ్ గా రొమాన్స్ కలగలిపి ఈ మూవీ ని దర్శకుడు తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో హెబ్బా పటేల్ తన అదిరిపోయే అందాలతో రెచ్చిపోయింది. ఈ సినిమాకి హెబ్బా పటేల్ అందాలు కూడా ప్లస్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఆహా , అమెజాన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లలో ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: