మహేష్ కు బాగా కలిసి వచ్చిన ఆ దర్శకుడు.. ఏకంగా అన్ని హిట్స్..?

MADDIBOINA AJAY KUMAR
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే మహేష్ బాబు ఇప్పటివరకు చాలా సార్లు దర్శకులను రిపీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మహేష్ బాబు కెరియర్లో ఎక్కువ శాతం దర్శకుడిని రిపీట్ చేసిన సమయంలో ఆయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలు దక్కిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. కానీ ఒక దర్శకుడు మాత్రం మహేష్ బాబుతో రెండు సినిమాలను రూపొందించగా రెండు మూవీ లతో కూడా మహేష్ కు అదిరిపోయే రేంజ్ విజయాలను అందించాడు.

ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా ..? ఆయనే మరెవరో కాదు ... టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. మహేష్ బాబు , పూరి జగన్నాథ్ కాంబోలో మొదటగా పోకిరి అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఏకంగా అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో బిజినెస్ మాన్ అనే మూవీ వచ్చింది. ఇక పోకిరి కాంబో కావడంతో ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. అలా మహేష్ బాబు , పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన పోకిరి , బిజినెస్ ప్లాంట్ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి. ఈ రెండు సినిమాల ద్వారా మహేష్ కి మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: