నందమూరి కుటుంబానికి విజయశాంతి భర్తకు ఉన్న లింక్ ఏంటి? .. అసలు నిజం ఇదే..!
అలాగే తన నటనతో విశ్వ నట భారతి గా పేరు తెచ్చుకున్నారు. ఇక 1964 జూన్ 24న వరంగల్ లో జన్మించిన ఈమె అసలు పేరు శాంతి. తన పిన్ని పేరు నుంచి విజయను తీసుకుని విజయశాంతిగా మార్చుకుంది. విజయశాంతి హీరోయిన్గా మొదట 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుల్ ఈరమ్ .. ఈ సినిమాలో నటించే సమయంలో ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు .. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత స్టార్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే కెరియర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. అయితే ఈమె భర్త మరెవరో కాదు ఎన్టీఆర్ పెద్ద అల్లుడు.. గణేష్ రావ్ కి స్వయానా మేనల్లుడు అవుతారు. అలాగే నటసింహం బాలకృష్ణతో కూడా ఈయనికి మంచి స్నేహబంధం ఉంది. ఆ స్నేహంతోనే బాలకృష్ణతో ఆయన ఒక సినిమా చేయాలని భావించారు.
అందులో భాగంగానే బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించి ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిప్పురవ్వ సినిమాను తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా ఆ సమయంలో పలువురు పేర్లు పరిశీలించిన చివరికి విజయశాంతినే తీసుకున్నారు. ఈ సినిమాను నిర్మించేటప్పుడు శ్రీనివాస్ ప్రసాద్ స్వయంగా విజయశాంతి దగ్గరకు వెళ్లి ఈ సినిమాలో నటించడానికి ఒప్పించారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి ,పెళ్లికి దారి తీసింది. ఇకపోతే నిప్పురవ్వ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ - శ్రీనివాస్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే ఈయనకు పోటీగా మరో సినిమా బంగారు బుల్లోడు పోటీగా దింపారట బాలకృష్ణ. ఈ పోటీల్లో బంగారు బుల్లోడు హిట్‌గా నిలవగా.. నిప్పురవ్వ యావరేజ్ గా నిలిచింది. విజయశాంతి - బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం.