అప్పుడు పవన్ ఇప్పుడు చిరు త్యాగాలు.. ఆ తప్పు చేస్తే మెగా ఫ్యామిలీకే నష్టమా?
పవన్ కళ్యాణ్ సైతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఒక హీరోగా నటించడంతో భీమ్లా నాయక్ ను వాయిదా వేయడానికి అంగీకరించారు. అయితే కరోనా కేసులు పెరగడం వల్ల ఆ సమయంలో ఆర్.ఆర్.ఆర్ ను రిలీజ్ చేయాలని భావించినా ఆ సినిమా రిలీజ్ సాధ్యపడలేదు. ఆ విధంగా అటు రామ్ చరణ్ ఇటు పవన్ నష్టపోవడం జరిగింది. ఇప్పుడు చరణ్ గేమ్ ఛేంజర్ కు ఇదే సమస్య ఎదురవుతోంది.
దాదాపుగా మూడేళ్ల పాటు షూటింగ్ ను గేమ్ ఛేంజర్ జరుపుకోగా దసరా కానుకగా ఈ సినిమా టీజర్ విడుదలవుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈరోజు అయితే గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కావడం లేదు. గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సైతం సమాధానం మాత్రం దొరకడం లేదు. గేమ్ ఛేంజర్ మూవీ బడ్జెట్ పరంగా కూడా టాప్ మూవీ కాగా ఎస్వీసీ బ్యానర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.
ప్రస్తుతం విశ్వంభర సినిమా సైతం గేమ్ ఛేంజర్ కోసం వాయిదా పడుతోంది. విశ్వంభర వాయిదా తర్వాత గేమ్ ఛేంజర్ అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోతే ఇబ్బాందులు తప్పవని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి కూడా గేమ్ ఛేంజర్ వాయిదా పడితే మెగా ఫ్యామిలీకి ఇబ్బందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.