రివ్యూ: విశ్వం సినిమా మీద ఆధారపడ్డ ముగ్గురు కెరియర్.. హిట్ కొట్టినట్టేనా..?

Divya
టాలీవుడ్ లో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా డైరెక్టర్ శ్రీనువైట్ల పేరు సంపాదించారు.. ఈ మధ్యకాలంలో కొన్ని యాక్షన్ సినిమాలతో దూసుకుపోతున్నారు. కానీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు తాజాగా హీరో గోపీచంద్ తో విశ్వం సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ప్రేక్షకులకు ఏ విధంగా ఈ సినిమాని రిసీవ్ చేసుకున్నారో తెలియజేశారు వాటి గురించి చూద్దాం.

ముఖ్యంగా విశ్వం సినిమా అటు శ్రీను వైట్లకు ఇటు గోపీచంద్ కు హీరోయిన్ కావ్య దాపర్ ముగ్గురు కెరియర్ కూడా ఈ సినిమా మీద ఆధారపడి ఉంది. విశ్వం సినిమా చూసిన కొంతమంది నేటిజన్ ఇలా మాట్లాడుతూ.. యాక్షన్స్ సన్నివేశాలు భారీగా ఉన్నాయని బోయపాటిని మించి మరి ఇందులో స్టిల్స్ ఉన్నాయని వెల్లడిస్తున్నారు. గోపీచంద్ యాక్షన్ సన్నివేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు తన నటనతో మరొకసారి తన స్టైల్  ఏంటో చూపించారని మరొకటి చెప్పు తెలియజేస్తున్నారు.


ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ సన్నివేశం కూడా హైలెట్గా నిలుస్తున్నాయని.. ఇలాంటి సన్నివేశాలు తీయడంలో శ్రీనువైట్ల ఒక సపరేటర్ స్టైల్ ఉందని తెలుపుతున్నారు. శ్రీనువైట్ల రొటీన్ ఫార్ములాని పక్కన పెడితే ఫస్టాఫ్ మొత్తంలో చాలా కామెడీ వర్కౌట్ అయిందని సినిమా చూసిన వాళ్లంతా కూడా తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ కూడా బాగా సక్సెస్ అయిందని శ్రీనువైట్ల పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ అదరగొట్టేసారని కూడా తెలుపుతున్నారు. మొత్తానికి విశ్వం సినిమా ప్రీమియర్ రిపోర్ట్ అయితే బాగానే ఉంది హిట్ టాక్ కూడా వినిపిస్తోంది. హీరోయిన్ కూడా అదరగొట్టేసిందని ఆమె నటనతో గ్లామర్ తో మరొకసారి ఆకట్టుకుందంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ చివరిలో క్లైమాక్స్ ఇంకా కొంచెం బాగా తీసి ఉంటే భారీ బ్లాక్ బస్టర్ అయ్యేది అని తెలుపుతున్నారు. మరి పూర్తి రివ్యూ కావాలి అంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: