"ఊ అంటావా మావ" పాట కంటే ముందే ఆ స్టార్ హీరోతో ఐటెం సాంగ్ ఆఫర్ అందుకున్న సమంత.. ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే..!?
హీరోయిన్ గా సమంతకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. 'ఏం మాయ చేసావే' అనే సినిమాతో చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్లను తన కంటిచూపుతోనే మాయ చేసేసింది . మరి ముఖ్యంగా ఒకే ఒక్క స్మైల్ తో టాలీవుడ్ ను అలా ఫిదా చేసి పడేసింది . ఆ తర్వాత సమంత ఖాతాలో ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ పడ్డాయో అందరికీ తెలిసిందే . అయితే ఎప్పుడూ కూడా సమంత ఐటమ్ సాంగ్ చేయాలి అన్న ఆలోచన లేదు .
కానీ ఎవరు ఊహించిన విధంగా సమంత తన కెరియర్ లో ఫస్ట్ టైం "ఊ అంటావా మావ" అనే ఐటెం సాంగ్ లో చిందులు వేసింది. ఈ పాట ఇప్పటికీ పలు ఫంక్షన్స్ లో పెట్టి ధూమ్ ధామ్ అనే రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు అంటే కారణం మాత్రం సమంత హాట్ స్టెప్స్ అని చెప్పాలి . నిజానికి పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కన్నా ముందే సమంతకు పలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లో నటించే అవకాశం వచ్చిందట .
కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేస్తూ వచ్చిందట . మరీ ముఖ్యంగా మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో తమన్నా నటించిన 'డ్యాంగ్ డ్యాంగ్' లో మొదటగా హీరోయిన్గా సమంతని అనుకున్నారట . కానీ సమంత ఆ ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేసిందట . అప్పటికే సమంత - నాగచైతన్య విడాకులు తీసుకోవాలి అనే గొడవల్లో ఉండిపోయారట. ఆ మైండ్ సెట్ తోనే సమంత ఈ పాటను రిజెక్ట్ చేసిందట . ఫైనల్లీ బన్నీ సినిమాతోనే సమంత ఐటమ్ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ప్రజెంట్ సమంత పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో అందరికీ తెలుసు . మంత్రి కొండా సురేఖ - సమంత పై చేసిన కొన్ని ఆరోపణలే అందుకు కారణం . అయితే కొండా సురేఖ తన మాటలను వెనక్కి తీసుకొని సమంతకు క్షమాపణలు కూడా చెప్పింది..!!