ట్రైలర్: కామెడీతో మరో హిట్ కొట్టేలా ఉన్న సుహాస్. జనక అయితే గనక అదుర్స్..!

Divya
తెలుగు సినీ పరిశ్రమకు దొరికిన అద్భుతమైన నటులలో నటుడు సుహాస్ కూడా ఒకరు.. అటు హీరోగా, కమెడియన్గా విలన్గా ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటించగలిగిన నటుడుగా పేరుపొందారు సుహాస్. ఇటీవలే గొర్రె పురాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు తాజాగా జనక అయితే గనక అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి బంగ్లా డైరెక్షన్ల తెరకెక్కించారు.

దిల్ రాజు  ప్రొడక్షన్ పథకం పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ తదితర నటి నటులు ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రమోషన్స్ లో కూడా వేగవంతంగా పాల్గొన్న చిత్ర బృందం సినిమా ట్రైలర్ ని కూడా ఇటీవలే విడుదల చేసింది. ఈ సినిమా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. జనక అయితే గనక సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో మరొకసారి మిడిల్ క్లాస్ అబ్బాయిగా (సుహాస్) కనిపించబోతున్నారు.. వివాహమైన తర్వాత పిల్లలు పుడితే ఖర్చులు ఎక్కువ అవుతాయని పిల్లలు వద్దనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఒత్తిడి తెస్తూ ఉంటారు.

అటు ఇంట్లో వాళ్లతో ఇటు భార్యతో బయట సమాజంతో జరిగేటువంటి కొన్ని సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తున్నాయి. అయితే అనుకోకుండా  సడన్గా అతని భార్య ప్రెగ్నెంట్ అవుతుంది.. అయితే తాను వాడిలా కండోమ్ వలన ఇలా అయింది ఇది నాసిరకం సప్లై అంటూ కంపెనీ మీద కేసు వేస్తారు.. ఆ తర్వాత సుహాస్ జీవితం ఎలా మలుపు తిరుగుతుంది.. కేసు గెలిచారా లేదా..? అనే కథాంశం తెలియాలి అంటే అక్టోబర్ 12వ తేదీ వరకు ఆగాల్సిందే. మరొకసారి జనక అయితే గనక ట్రైలర్ తో ప్రేక్షకులను గడుపుబ్బ నవ్వించిన సుహాస్ మరియు థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులను ఏ విధంగా నవ్విస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: