ఆ హీరోయిన్ కి షాక్ ఇచ్చిన ప్రభాస్ .. కట్ చేస్తే పాన్ ఇండియా స్టార్..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో ఎదగాలంటే టాలెంట్ తో పాటు ఎంతో కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఇలా కొంత మంది ఎంతోకాలంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న.. చిన్నచిన్న వేషాలు కూడా రావు. కొందరికి మాత్రం ఇండస్ట్రీలో అడుగుపెట్టినన వెంటనే స్టార్స్ అయిపోతూ ఉంటారు. ఇలా తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో స్టార్లుగా మారిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారిలో ఈ భామ కూడా ఒకరు. ఈమె సౌత్ చిత్ర పరిశ్రమలో తన కెరీర్ను మొదలుపెట్టి.. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇంతకీ ఈ హీరోయిన్ మరెవరో కాదు.. ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.

ఇక ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ త్వరగానే వచ్చిన కెరియర్ మొదట్లో ఆమెను ప్రభాస్ సినిమా కోసం సెలెక్ట్ చేసి.. నాలుగు రోజులకు పైగా షూటింగ్ చేసి ఈమెను సినిమా నుంచి తీసేశారు. ఈ సినిమానే కాకుండా ఇంకొన్ని పెద్ద సినిమాల విషయంలో కూడా రకుల్ కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా వరుస అవకాశాలు అందుకుంది. 2009లో రకుల్ గిల్లీ అనే కన్నడ మూవీలో కూడా హీరోయిన్గా పరిచయమైంది. అలాగే 2011లో వచ్చిన కెరటం సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ వచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలతో నటించింది. అయితే ఈమె ముందుగా ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమెను ఆ సినిమా నుంచి తీసేసారు.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రకుల్ చెప్పుకొచ్చింది. తన తొలి సినిమాకు ముందు ఒక సినిమాకి హీరోయిన్గా నన్ను సెల్ట్‌ చేసి నాలుగు రోజులు షూటింగ్ చేసి ఆ తర్వాత ఆ సినిమా నుంచి తొలగించారు . కనీసం ఆ విషయాన్ని తనకు కూడా చెప్పలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ సినిమా నాకు రావాల్సింది కాదేమో అనుకుని  నా ప్రయత్నాలు నేను చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది. అయితే ఆ సినిమా మరేదో కాదు మిస్టర్ పర్ఫెక్ట్. ఇదే కాకుండా ఇండియా క్రికెట్  కెప్టెన్ ధోని లైఫ్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఎంఎస్ ధోని సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్గా నటించాల్సి ఉంది. కానీ ఆ సినిమా నుంచి కూడా ఈమె తప్పుకుంది. ధోని సినిమాకు నన్ను సెలెక్ట్ చేశాక ఆ తర్వాత మళ్లీ దిశా పటానీని హీరోయిన్గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో వ‌రుస‌ సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ లో కూడా మరోసారి రియంట్రి ఇవ్వడానికి రెడీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: