సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాల కథలు నచ్చిన కూడా నటీ నటులు ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. ఇక సినిమా విడుదల అయ్యాక వారు వదులుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినా , అలాగే ఆ మూవీ లో వారు రిజెక్ట్ చేసిన పాత్రకు పెద్దగా గుర్తింపు దక్కకపోయినా ఆ సినిమాను రిజెక్ట్ చేసినందుకు పెద్దగా వారేమీ ఫీల్ కారు. అదే సినిమా సూపర్ సక్సెస్ అయిన , లేకపోతే వారు రిజెక్ట్ చేసిన పాత్రకు అద్భుతమైన గుర్తింపు లభించిన ఆ మూవీ ని ఎలాగోలాగా చేసి ఉంటే బాగుండేది అనుకుంటూ ఉంటారు.
ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ కేర్ లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందట. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నాకు హిందీ సినిమా అయినటువంటి ధోనీ ది ఆన్ టోల్డ్ స్టోరీ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. కాకపోతే ఆ సినిమా ఆఫర్ వచ్చిన సమయానికి నేను రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న బ్రూస్ లీ సినిమా చేస్తున్నాను. ధోనీ ది ఆన్ టోల్డ్ స్టోరీ మూవీ ఆఫర్ వచ్చిన సమయానికి బ్రూస్ లీ ఆ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. కాకపోతే రెండు సాంగ్స్ షూటింగ్ పెండింగ్లో ఉన్నాయి.
దానితో నేను ధోనీ ది ఆన్ టోల్డ్ స్టోరీ సినిమా చేయలేకపోయాను అని ఈ ముద్దుగుమ్మ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన బ్రూస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కాగా , రకుల్ రిజెక్ట్ చేసిన ధోనీ ది ఆన్ టోల్డ్ స్టోరీ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం రకుల్ తెలుగు సినిమాల కంటే కూడా తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి చాలా ఆసక్తిని చూపిస్తుంది. వరుస పెట్టి కోలీవుడ్ , బాలీవుడ్ సినిమాలలోనే నటిస్తోంది.