ఎంత దురదృష్టం అతి అందమే ఈ హీరోయిన్ కొంప ముంచిందా..?
అందమే శాపంగా మారిన హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ దియా మిర్జా. ఈమె తండ్రి జర్మన్ అయినప్పటికీ తల్లి బెంగాలీ ప్రాంతం చెందిన వ్యక్తి. దియా మిర్జా తల్లిదండ్రులు కూడా కొన్ని రోజులకు విడిపోవడంతో ఈమె తల్లి మరొకరిని వివాహం చేసుకున్నదట. అందుకే తన తల్లిదండ్రుల పేరును ఈమె ఉపయోగించుకోలేదట. 2001లో హీరో మాధవన్, రీమాసేన్ నటించిన మిన్నెలే చిత్రాన్ని హిందీలో హై తేరి దిల్ మే అనే పేరుతో రీమేక్ చేయగా ఇందులో మాధవన్ కు జోడిగా నటించిందట దియా మిశ్రా.
ఈ చిత్రంతో తన అందం నటన గురించి ప్రశంసలు అందుకుంది.అయితే ఆ తర్వాత ఆఫర్లు తగ్గిపోతూ వచ్చాయట.. అందుకు కారణం దియా మిర్జా విపరీతమైన అందం వల్లే ఈమెకు చాలా సినిమా అవకాశాలు కోల్పోయిందట. కొన్ని పాత్రల కోసం ఈమెను ప్రత్యేకంగా దర్శకులు తీసుకున్నప్పటికీ మళ్లీ కొన్ని కారణాల చేత ఇమెను తిరస్కరించారట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దియా మిర్జా మాట్లాడుతూ తనను దర్శకులు మెయిన్ స్క్రిప్ట్ నటిగా చూశారు కాబట్టే తాను కోరుకున్న మంచి కథలను నటించలేకపోయానని తెలుపుకొచ్చింది.. ఇలా విపరీతమైన అందం వల్లే ఎన్నో చిత్రాలలో అవకాశాలను కోల్పోయింది దియా మిర్జా. మరి రాబోయే రోజుల్లోనైనా ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.