మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్లో ముచ్చటగా తెరకెక్కిన మూడో సినిమా మిస్టర్ బచ్చన్. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైన మిస్టర్ బచ్చన్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు పోటీగా ఇస్మార్ట్ శంకర్, ఆయ్ వంటి సినిమాలు బరిలో ఉండడంతో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర కూడా వసూళ్లో వెనకపడిపోయింది. ఇకపోతే మిస్టర్ బచ్చన్ తర్వాత భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితో రవితేజ ఓ సినిమా చేస్తోన్నాడు. రవితేజ కెరీర్లో 75వ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార
ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇక మాస్ యాక్షన్ కామెడీ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ఇది. దర్శకుడిగా భాను భోగవరపుకు ఇదే మొదటి మూవీ. అయితే హరీష్ శంకర్ రవితేజకు మిరపకాయ్ అనే బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఇచ్చారు. 2011లో విడుదలైన ఈ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో రవితేజ పోలీస్ ఆఫిసర్ గా నటించి మెప్పించారు. ఈ కు థమన్ అందించిన సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీలో రవితేజ సరసన ఇద్దరు బామలు
నటించారు. రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ ఈ లో హీరోయిన్స్ గా చేశారు. ఈ ఇద్దరు భామలు తమ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే వీరిలో రిచా గంగోపాధ్యాయ బాగా క్లిక్ అయ్యింది. ఈ భామకు మిరపకాయ్ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ అమ్మడు మిరపకాయ్ కంటే ముందు రానా దగ్గుబాటి అరంగేట్రం చేసిన లీడర్ తోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ పరంగా పీక్స్ దశలో ఉండగానే అమెరికాకు వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ అక్కడ జో లాంగేల్లా అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెద్దల అనుమతితో కలిసి ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే లకు గుడ్ బై చెప్పిన ఈ భామ ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మంది గూగుల్ లో గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి...!!