• పైసా తర్వాత మళ్లీ ఎన్నో అట్టర్ ప్లాప్‌లు
• 2019 తర్వాత నాని కెరీర్ ముగిసింది అనుకున్నారు
• పెద్ద డిజాస్టర్లే అతడిని పలకరించాయి
నేచరల్ స్టార్ నాని తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన మొదటి సినిమా అష్టాచమ్మా. ఈ సినిమా తర్వాత రైడ్, స్నేహితుడు, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. వీటి తరువాత నాని స్టార్ హీరో అయిపోయాడు. నాని ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించగలడు అందుకే ఫస్ట్ నుంచి విభిన్నమైన ఛాలెంజింగ్, రోల్స్ అదరగొడుతూ వస్తున్నాడు. అయితే 2019 తర్వాత నానికి చాలా గడ్డుకాలం నడిచింది. మరింత సింపుల్ గా చెప్పాలంటే అతనికి డిజాస్టర్ కాలం నడిచింది..
2020లో ఈ నేచురల్ స్టార్ "V" అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేశాడు. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి నటించిన ఈ హై బడ్జెట్ మూవీ ఆశించినంత బాగా ఆడలేకపోయింది. ఇది రొటీన్ రివెంజ్ డ్రామా లాగే ఉండటంవల్ల ప్రేక్షకులు పూర్తిగా రిజెక్ట్ చేశారు. ఇది క్యాట్ అండ్ మౌస్ కథ అయినా, నాని, సుధీర్ బాబు లాంటి నటుల వల్ల ఈ సినిమాపై ఫస్ట్ నుంచి భారీ ఎత్తున హైప్స్ నెలకు ఉన్నాయి. సినిమా ఫస్టాఫ్ పర్లేదు అనిపించింది కానీ సెకండ్ ఆఫ్ చాలా చెత్తగా సాగింది. స్టోరీ బోరింగ్‌గా మారింది. అంతే కాదు క్లైమాక్స్ వరస్ట్ గా అనిపించింది. దాంతో ఈ మూవీ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.
2021లో శివ నిర్వాణ, నాని కాంబినేషన్‌లో వచ్చిన "టక్ జగదీష్" సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇది కూడా ఒక ఆప్షన్ డ్రామా ఫిలిం. ఇందులో హీరో హత్యలు, అరాచకాలకు చెప్పి పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో విలేజ్‌లో నెలకొల్పాలని భావిస్తాడు. ఈ సినిమా స్టోరీ చాలామందికి నచ్చలేదు ఇది ఒక ఔట్‌డేటెడ్ స్టోరీ అని విమర్శకులు కూడా ఏకిపారేశారు. టక్ జగదీష్ ప్రేడిక్టబుల్ స్టోరీ లైన్ ఫ్యామిలీ డ్రామా తో వచ్చింది. ఇందులోని ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూమెంట్స్ అందరికీ పిచ్చెక్కించాయి. ఏదో ఎమోషన్స్ పండించాలని డైరెక్టర్ ప్రయత్నించాడు కానీ అవి మాత్రం ప్రేక్షకులకు నచ్చలేదు. దీని తర్వాత తీసిన "అంటే సుందరానికి" మూవీ కూడా పెద్దగా ఆడలేదు. అయితే శ్యామ్ సింగ రాయ్, దసరా, హాయ్ నాన్న సరిపోదా శనివారం సినిమాలు హిట్ అయి మళ్ళీ అతడిని కెరీర్ ని గాడిలో పడేసాయి.