టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన కమీడియన్ గా గుర్తింపును సంపాదించుకున్న సునీల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాల్లో కామెడీ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఈయన మొదటగా అందాల రాముడు అనే సినిమాలో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మర్యాద రామన్న సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. దానితో ఈయన కొంత కాలం పాటు కేవలం సినిమాలో హీరో పాత్రలలో నటిస్తూ మాత్రమే వచ్చాడు.
కానీ హీరో పాత్రల్లో ఈయన నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ రావడంతో మళ్లీ ఈయన సినిమాలల్లో కామెడీ , విలన్ , కీలక పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో సునీల్ కు ఒక వింత సంఘటన ఎదురైందట. సునీల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి రావడంతో ఆయనకు కారు లేదు. దానితో స్టార్ కమెడియన్ అయ్యాక ఆయన కారు కొనాలి అనుకున్నారట. అందులో భాగంగా ఎలాంటి కారు బాగుంటుంది అనే సలహా తీసుకుందాం అనుకున్నారట. తక్కువ బడ్జెట్లో ఐటెం కారు కొనాలి అని సునీల్ నిర్ణయానికి వచ్చాడట. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ కు సునీల్ చెప్పాడట. దానితో ఆయన ఐ 10 కారు కొంటావా ఆటో కొనుక్కో బాగుంటుంది. అదే నీకు చాలా సౌకర్యంగా ఉంటుంది అని అన్నారట.
ఆయన సమాధానం విని సునీల్ షాక్ అయ్యాడట. ఆ తర్వాత స్రవంతి రవి కిషోర్ ... నీ పర్సనాలిటీకి ఐ 10 కార్ అస్సలు సరిపోదు. నీవు చాలా ఇబ్బంది పడతావు. అలాగే నువ్వు ఎప్పుడు ఏదో లగేజ్ పట్టుకొని తిరుగుతూ ఉంటావు. నువ్వు ఐ 10 కారు కొనుక్కున్న అది సౌకర్యంగా ఉండదు. కాస్త డబ్బులు ఎక్కువ అయినా పర్లేదు మంచి కారు కొనుక్కో అని ఆయన సమాధానం ఇచ్చాడట.