సంపత్ నంది నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది.. హీరో ఎవరో తెలుసా..?

frame సంపత్ నంది నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది.. హీరో ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో సంపత్ నంది ఒకరు. ఈయన వరుణ్ సందేశ్ హీరోగా నిషా అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన ఏమైంది ఈవేళ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తో ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా రచ్చ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
 

ఇక అప్పటినుండి ఈయన వరుస పెట్టి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. ఆఖరుగా సంపత్ నంది , గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్గా రూపొందిన సిటీమార్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సంపత్ నంది ఆ హీరోతో సినిమా చేయనున్నాడు , ఈ హీరోతో సినిమా చేయనున్నాడు అని అనేక మంది పేర్లు వచ్చాయి. కానీ అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మాత్రం వెలువడలేదు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సంపత్ నంది తన తదుపరి మూవీ ని శర్వానంద్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ రోజు లక్ష్మీ రాధామోహన్ ప్రెజెంట్స్ , శ్రీ సత్యసాయి ఆర్ట్స్ వారు ప్రొడక్షన్ నెంబర్ 15 కి సంబంధించిన అప్డేట్ ను రేపు ఉదయం 9 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ పోస్టర్ సంపత్ నంది నెక్స్ట్ మూవీ కి సంబంధించింది అని తెలుస్తుంది. ఈ మూవీ లో శర్వానంద్ హీరో గా నటించబోతున్నట్లు రేపు ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: