మాస్ మహారాజా రవితేజ కొంత కాలం క్రితం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈగల్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కావ్య దాపర్ , రవితేజకు జోడిగా నటించగా , అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. నవదీప్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాను మొదటగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కానీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు అనేక సినిమాలు విడుదల ఉండడంతో ఏ మూవీ అయిన సంక్రాంతి బరి నుండి తప్పుకుంటే దానికి సోలో విడుదల ఇస్తాము అని వేరే సినిమాలు నుండి పోటీ లేకుండా చేస్తాము అని అనేక మంది తెలుగు సిని పెద్దలు చెప్పడంతో ఈగల్ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఫిబ్రవరి నెలలో సోలోగా విడుదల అయింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయికి అందుకోలేదు. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం RT 75 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు.
కానీ ఈ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. మరి ఆఖరుగా సంక్రాంతి రేసులో రవితేజ "క్రాక్" మూవీ తో నిలిచాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈగల్ మూవీ తో సంక్రాంతి బరిలో దిగాలి అనుకున్న అప్పుడు కుదరలేదు. ఇక RT 75 మూవీ ని సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చిన అది కూడా సంక్రాంతి రెస్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి సంక్రాంతి కి రావాలి అని ప్రయత్నాలను చేస్తున్న రవితేజకు ఈ మధ్యకాలంలో సంక్రాంతి విడుదల కుదరడం లేదు.