'కంగువా' రిలీజ్ కు మేకర్స్ మాస్టర్ ప్లాన్.. ఏకంగా అన్ని థియేటర్స్ లో..?

murali krishna
త‌మిళ‌ స్టార్ హీరో సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ౩డీ ఫార్మాట్‌లో సందడి చేయనుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్ట‌ర్‌లు విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టింది చిత్ర‌యూనిట్.అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా విడుద‌ల తేదీ వాయిదా ప‌డ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.ఈ సినిమా విడుద‌ల తేదీ రోజునే త‌మిళంలో మ‌రో పెద్ద సినిమా రాబోతుంది. ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్‌’. తెలుగులో వేట‌గాడు అని వ‌స్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నవంబర్ 15న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

10భాషల్లో రూపొందిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 12వేలకు పైగా థియేటర్ లలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించగా, దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇదిలావుండగా కంగువ సినిమా విషయానికొస్తే కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈసినిమా సిద్ధమవుతున్నట్లు టాక్. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దిశా పఠానీ హీరోయిన్గా నటిస్తున్నారు. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, స్టూడీయే గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 'కంగువా' వచ్చే ఏడాది వేసవి కానుకగా ఇది విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పార్ట్-2, 3లు సిద్ధంగా ఉన్నాయని టాక్. పార్ట్-1 విజయం ఆధారంగా మిగిలిన వాటిని తెరక్కెకించే ప్లాన్లో చిత్ర బృందం ఉందని సమాచారం. మొదటి భాగం ఎలాంటి రిజల్ట్ను అందుకుంటుందో చూడలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: