ఇదెక్కడి లైనఫ్ సామీ.. దిమ్మతిరిగిపోతుంది.. నాగ చైతన్య ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇవే?
ఇక ఈ సినిమా తరువాత చే వరుసగా బడా సినిమాలను క్యూలో పెట్టినట్టు తెలుస్తోంది. అవును, నాగ చైతన్యతో లవ్ స్టోరీ అనే సూపర్ హిట్ తీసిన దర్శకుడు శేఖర్ కమ్ములతో మరోమారు ఈ కాంబో సెట్ కానుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తారని టాక్ నడుస్తోంది. అదే విధంగా ప్రస్థానం వంటి సూపర్ హిట్ పొలిటికల్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు దేవా కట్టా ఓ కథని చేకి వినిపించగా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని టాక్. కాగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రాబోతుంది. అదేవిధంగా తమిళ దర్శకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సూపర్ హిట్ సినిమా ఖుషి సినిమాని తెరకెక్కించిన దర్శకుడు కరుణాకరన్ కంబోకూడా సెట్ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇకపోతే చే తాజా సినిమా టాండేల్ కూడా పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్న సంగతి విదితమే. కాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బుజ్జి తల్లి అనే లిరికల్ సాంగ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ పాట మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. విషయం ఏమిటంటే... ఈ సాంగ్ యూట్యూబ్లో ఏకంగా 40 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం విశేషం.