నటుడు శ్రీహరి విలక్షణ నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించారు. అయితే అలాంటి ఈయన మరణం చాలామందిని కలచివేసింది. అసలు ఈయన మరణం కూడా ఎవరు ఊహించలేనిది. చనిపోయే వరకు కూడా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అలా సడన్గా చనిపోయేసరికి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. అయితే శ్రీహరి అంతకుముందే అనారోగ్య సమస్యలతో బాధపడ్డప్పటికీ ఆ విషయాన్ని ఎక్కువగా బయటకి తెలియనిచ్చేవారు కాదట.దాంతో చివరికి అనారోగ్య సమస్యలు ఎక్కువై మరణించారు.ఇక శ్రీహరి మరణం తర్వాత ఆయన కుటుంబం చాలానే ఇబ్బందులు పడిందట. ముఖ్యంగా పిల్లలు సెట్ అవ్వకపోవడంతో శ్రీహరి భార్య డిస్కో శాంతి ఎన్నో ఇబ్బందులు పడిందట.అయితే విషయాలన్నీ ఆమె ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొని బాధపడింది.
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేసింది.. వాడు కనిపిస్తే చంపేస్తా అంటూ డిస్కో శాంతి వార్నింగ్ ఇచ్చింది.. మరి ఇంతకీ డిస్కో శాంతిని మోసం చేసింది ఎవరో ఇప్పుడు చూద్దాం.. హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరి ఇండస్ట్రీలో ఐటెం డాన్సర్ అయినటువంటి డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే శ్రీహరి మరణించాక ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి మాట్లాడుతూ.. శ్రీహరి మరణించాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆయన చనిపో ముందుకు మా ఇంట్లో 5 కార్లు ఉండేవి. ఇక ఆయన కొన్న జాగ్వర్ కార్ కి ఈఎంఐ కడుతూ వస్తున్నాడు.
కానీ ఆయన మరణంతో ఈఎంఐ రెండు మూడు సార్లు మిస్ అవ్వడంతో చివరికి మనోహర్ అనే వ్యక్తి వచ్చి కార్ కూడా లాక్కొని పోయాడు. వాడు నాకు మళ్ళీ కనిపిస్తే చంపేస్తా.. కారుకి కట్టిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. అలా ఒకటి కాదు రెండు కార్లు పోయాయి. ఆ తర్వాత ఇంట్లో బంగారం కూడా దొంగతనం చేశారు..అయితే ఈ విషయం నేను గమనించలేదు.మూడు నెలల తర్వాత కంప్లైంట్ ఇస్తే ఫలితం లేకుండా పోయింది. అలా ఎన్నో ఆస్తులు కోల్పోయాం. అప్పులన్నీ తీర్చేశాం ఇప్పుడే లైఫ్ లో కాస్త సెట్ అయ్యాం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అంటూ డిస్కో శాంతి చెప్పుకొచ్చింది.