మైత్రీ మూవీ మేకర్స్ దశ తిరిగిందిగా.. ఇతర భాషల్లో సైతం భారీ బ్లాక్ బస్టర్స్!

frame మైత్రీ మూవీ మేకర్స్ దశ తిరిగిందిగా.. ఇతర భాషల్లో సైతం భారీ బ్లాక్ బస్టర్స్!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కూడా ఒకటి. పుష్ప2 సినిమాతో ఈ బ్యానర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తమ ప్రాజెక్ట్ లతో ఇతర భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
 
గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్ సినిమాలతో కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ తో విడుదలయ్యాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ యావరేజ్ రివ్యూలతో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా జాట్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో సైతం బుకింగ్స్ విషయంలో అదరగొడుతోంది. ఈ సినిమాల విజయాలతో మైత్రీ మూవీ మేకర్స్ దశ తిరిగింది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలకు సంబంధించి సక్సెస్ అయిన బ్యానర్లు చాలా తక్కువ.
 
ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ సక్సెస్ రేట్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పవచ్చు. అయితే రాబిన్ హుడ్ సినిమాతో మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ కు భారీ షాక్ తగిలింది. ఈ సినిమా వల్ల నిర్మాతలకు ఏకంగా 19 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని తెలుస్తోంది. మైత్రీ నిర్మాతలు సినిమాల ఎంపికకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
మైత్రీ నిర్మాతలు కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకుంటూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. మైత్రీ నిర్మాతల భవిష్యత్తు ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో మైత్రీ నిర్మాతలు భారీ ప్రాజెక్ట్ లను ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ నిర్మాతలు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే జాట్ మూవీ కలెక్షన్లు మాత్రం మరీ భారీ స్థాయిలో అయితే లేవు.


 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: