గత కొద్ది రోజుల నుండి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.. మంచు మనోజ్ ఒకవైపు మోహన్ బాబు, మంచు విష్ణు మరోవైపు మంచు లక్ష్మి వీరిద్దరి మధ్య నలిగిపోతుంది. ఎప్పుడైతే మనోజ్ మౌనికని పెళ్లి చేసుకున్నాడో అప్పటినుండి వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి.అయితే పెళ్లి జరగక ముందు నుండే మనోజ్ ని మోహన్ బాబు ఫ్యామిలీ దూరం పెడుతూ వస్తోంది. ఇక పెళ్లయ్యాక వీరి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. అలా చాలా రోజుల నుండి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మనోజ్ పదేపదే మీడియా ముందుకు వస్తూ విష్ణు చేసే బాగోతలన్నీ బయటపెడుతూ వస్తున్నారు. ఇందులో మోహన్ బాబు కూడా ఎంట్రీ అయ్యి మనోజ్ కి వ్యతిరేకంగా ఉన్నారు.
అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మనోజ్ ని పట్టుకొని మంచు లక్ష్మి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.. మంచు లక్ష్మిని మంచు ఫ్యామిలీలో జరిగే గొడవల గురించి స్పందించమని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడగగా.. ఆ గొడవల గురించి మాట్లాడనని ప్రతి ఇంట్లో జరిగే సర్వసాధారణమైన గొడవలే అంటూ కప్పుకొచ్చింది. అయితే తాజాగా మంచు ఫ్యామిలీ లో జరిగే గొడవలు తీవ్రతరం అవ్వడంతో ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీచ్ ఫర్ చేంజ్ వార్షిక ఫండ్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మి తన కూతురితో కలిసి స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేసింది. ఆ టైంలో మంచు లక్ష్మి ని చూడడానికి మంచు మనోజ్ ఆయన భార్య మౌనిక ఇద్దరు వచ్చారు. ఇక స్టేజ్ మీద ఉన్న మంచు లక్ష్మిని తమ్ముడు మనోజ్ ఒక్కసారి గా వెనక్కి పిలిచాడు.దాంతో లక్ష్మి తమ్మున్ని చూసి ఎమోషనల్ అయ్యి పట్టుకొని గుక్క పట్టి ఏడ్చింది. లక్ష్మి మనోజ్ ని పట్టుకొని ఏడ్చిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది ఈ వీడియో చూసి ఇంట్లో జరుగుతున్న గొడవల గురించే లక్ష్మీ అలా మనోజ్ ని పట్టుకుని ఎమోషనల్ అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.