'కల్కి'లో యువ అశ్వత్థామగా.. అమితాబ్ ను ఎలా సృష్టించారో తెలుసా?
నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీ తో మైథాలజీకి, సైన్స్ ఫిక్షన్ జోడించి ఫ్యూచర్స్టిక్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను మంత్రముక్తులను చేసింది. కాగా ఈ మూవీలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. దీపికా పదుకొనే కీలకపాత్రలో కనిపించింది. అదే సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అశ్వద్ధామ లాంటి కీలకపాత్రలో నటించి ఆకట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితేఈ మూవీ మొత్తంలో అశ్వద్ధామ పాత్ర ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.
మొదట అశ్వద్ధమ పాత్ర ఎంతో యంగ్ గా కనిపిస్తుంది. ఇక తర్వాత అమితాబ్ పాత్ర ముసలి వ్యక్తి లాగానే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే యువ అశ్వద్ధామ పాత్ర ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇలా యువ అశ్వద్ధామను డిజైన్ చేసేందుకు మూవీ టీమ్ స్పెషల్ స్వాప్ టెక్నాలజీని వాడిందట. అమితాబ్ యువకుడిగా చేసినప్పటి సినిమాల నుంచి ముఖ కవళికల్ని మొదట తీసుకున్నారు. అనంతరం యుద్ధ సన్నివేశాలు అన్నీ కూడా డూప్ తో చేయించి.. అమితాబ్ ముఖ కవళికల్ని ఇక దానితో కలిపారు. ఈ క్రమంలోనే యువ అశ్వద్ధామను ఎలా డిజైన్ చేశారు అనేదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.