సమంత : రేవంత్ రెడ్డి దగ్గరికి కొత్త పంచాయితీ ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న... హీరోయిన్ సమంత... ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతోంది. విడాకులు అయినా కూడా సమంతకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ క్రేజ్ తగ్గలేదు. అయితే అలాంటి హీరోయిన్ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో.. సమస్యలపై పోరాటం చేసేందుకు నడుము కట్టుకున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కేరళ తరహాలో...  ప్రత్యేక కమిటీ వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సమంత విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత సంచలన పోస్ట్ కూడా పెట్టారు.  సౌత్ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీలలో...  కొంతమంది హీరోయిన్లు అలాగే చిన్నపాటి మహిళా నటులను కొంతమంది టార్గెట్ చేసి వేధిస్తున్నారట.

కేరళ రాష్ట్రంలో ఈ సంఘటనలు విపరీతంగా జరిగినట్లు ఈ మధ్య వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హేమ కమిటీని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. హీరోయిన్లకు ఎలాంటి వేధింపులు లేకుండా... ఆ కమిటీ తమ పని చేయనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హీరోయిన్ సమంత విజ్ఞప్తి చేయడం జరిగింది. హేమ కమిటీ తరహాలోనే... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక కమిటీ తీసుకురావాలని ఆమె కోరింది.

ఇప్పటికే హేమా కమిటీ ఏర్పాటుకు కారణమైన... డబ్ల్యూ సిసి సంస్థను...  ప్రసంశించారు హీరోయిన్ సమంత. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా... అలాంటి కమిటీ వేయాలని.. కోరుతున్నట్లు సమంత రిక్వెస్ట్ పెట్టారు. ఈ కమిటీ ఏర్పాటు వల్ల....  మహిళలకు ఎలాంటి వేధింపులు ఉండవని... ధైర్యంగా తమ పని తాము చేసుకోవచ్చని సమంత రియాక్ట్ అయ్యారు. మరి సమంత పోస్టు  పైన  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు చూడాలి. కాగా సమంత, నాగ చైతన్య 2021 లోనే విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: