నేనేం పబ్లిక్ ప్రాపర్టీని కాదు.. హీరోయిన్ తాప్సి షాకింగ్ కామెంట్స్?

praveen
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా సినీ సెలబ్రిటీలకు ప్రేక్షకులకు మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే ఒకప్పటిలా సినీ సెలబ్రిటీలను చూడాలంటే ఎక్కడో షూటింగ్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏకంగా సోషల్ మీడియా వల్ల నేరుగా మాట్లాడగలుగుతున్నారు అభిమానులు. అదే సమయంలో హీరో హీరోయిన్లు కూడా ప్రతి విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. చాలామంది హీరోయిన్లు ఒకప్పుడు ఏదైనా మాట్లాడాలన్నా వెనుక ముందు ఆలోచించేవారూ.

 కానీ ఇప్పుడు తమకు ఇబ్బంది కలుగుతుంది అని భావిస్తే.. మొహం మీద చెప్పేస్తూ ఉన్నారు. ఇలా ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు చేస్తున్న వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇంకొంతమంది ఏకంగా కెరియర్ తోలినాళ్లలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా సోషల్ మీడియాలో ఓపెన్ గా చెప్పేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ తాప్సి ఫోటోగ్రాఫర్లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి అని చెప్పాలి. సాధారణంగా ఎక్కడైనా సినీ సెలెబ్రెటీలు కనిపించినప్పుడు ఫోటోగ్రాఫర్లు సెలబ్రిటీలను ఫోటోలు తీయించుకోవడానికి కాస్త తొందర పడుతుంటారు. ఇంకొంతమంది కాస్త అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తూ ఉంటారు.

 ఇలాంటి వాళ్లను ఉద్దేశిస్తూ తాప్సి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఒక సెలబ్రిటీని అని పబ్లిక్ ప్రాపర్టీని కాదు అంటూ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తాప్సి చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. కెమెరాలతో మీదికి దూసుకు రావడం.. ఫిజికల్ గా హ్యాండిల్ చేస్తే స్వీకరించబోను అంటూ స్పష్టం చేశారు. తాను ముందుగా ఆడపిల్లనని ఇబ్బంది కలిగించవద్దు అంటూ సూచించారు. ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్లను ఉద్దేశిస్తూ తాప్సి చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయ్. ఇకపోతే తాప్సి మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ను వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది  అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: