ఓటీటీలో దుమ్మురేపుతున్న విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ మూవీ..!!

murali krishna
ఓటీటీ లకు ఇప్పుడు పెరుగుతున్న క్రేజ్ గురించి తెలియనిది కాదు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. అటు ఇటుగా రెండు మూడు నెలలలోపే ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇక ఇలా వచ్చిన వాటిలో కథను బట్టి కొన్ని సినిమాలు.. స్ట్రీమింగ్ స్టార్ట్ అయినా కొద్దీ గంటల్లోనే మంచి వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు టాప్ 10 లిస్ట్ ను అందిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో జూలై 12 న ఓటీటీ లోకి వచ్చిన ఓ సినిమా.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్స్ లో అత్యధిక వీక్షణలు పొందిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా మరేదో కాదు.. విజయ్ సేతుపతి కెరీర్ లోనే 50వ సినిమాగా.. రిలీజ్ కు ముందు నుంచే మంచి క్రేజ్ సంపాదించుకుంది.మక్కల్ సెల్వన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన తాజా మహారాజ. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తోనే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది మహారాజా సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది. ‘మహారాజా’ చిత్రం జూలై 14న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అంతకు ముందు థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా దాదాపు 100 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టింది.

ఇక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కొత్త రికార్డులను సృష్టించింది. హద్దులు దాటి కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువైన ‘మహారాజా’ సినిమా సినీ ప్రేమికుల హృదయాలను హత్తుకుంది. ఈ ఏడాది అత్యధిక మంది వీక్షించిన ఆంగ్ల భాషా చిత్రంగా ‘మహారాజా’ రికార్డు సృష్టించింది. అంతే కాదు, భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా కూడా మహారాజా గుర్తింపు పొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం టాప్ 10 జాబితాలోనే కొనసాగుతుండడం విశేషం.అది కూడా 8 దేశాల్లో ఉండటం మరో ఘనత.2024 నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన క్రూ, లాపతా లేడీస్, సినిమాలను వెనక్కి నెట్టి మహారాజా ముందుకు దూసుకొచ్చాడు. ఇప్పటి వరకూ ఈ సినిమాకి 1.86 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీనికి ముందు క్రూ మూవీకి 1.79 వ్యూస్ రాగా, లాపతా లేడీస్‌కు 1.71 కోట్లు వ్యూస్ వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లలో రికార్డులు కొళ్లగొట్టాయి.అయితే ఇప్పుడు అలాంటి సినిమాలను విజయ్ సేతుపతి మహారాజాతో వెనక్కి నెట్టాడు. ఈ సిమాలో అతనితోపాటు బాలివుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్చప్, భారతీరాజా, అభిరామ్, మోహన్ దాస్ తదితరులు నటించారు. ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అజనీస్ లోకనాథ్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: