మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అలా చిరంజీవి వదులుకున్న సినిమాలలో కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా మరికొన్ని బోల్తా కొట్టినవి కూడా ఉన్నాయి. ఇకపోతే చిరంజీవి తన కెరీయర్ లో వదిలి పెట్టిన ఒక బ్లాక్ బస్టర్ మూవీ గురించి తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా దివ్య భారతి హీరోయిన్ గా బి గోపాల్ దర్శకత్వంలో అసెంబ్లీ రౌడీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు కు దివ్య భారతి కి బి గోపాల్ కి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా మోహన్ బాబు ను కాకుండా చిరంజీవి ని బి గోపాల్ హీరో గా అనుకున్నాడట.
అందులో భాగంగా చిరంజీవి ని కలిసి ఈ సినిమా కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న చిరంజీవి సినిమా కథ సూపర్ గా ఉంది అని కూడా అన్నాడట. కాకపోతే అదే సమయం లో చిరంజీవి అనేక సినిమాలకు కమిట్ అయ్యి ఉండడంతో ఈ సినిమా చేయలేకపోయాడట. ఇక అదే సమయంలో చిరంజీవి అనేక సినిమాలతో బిజీగా ఉండడంతో బి గోపాల్ కి వేరే ఎవరితో నైనా ఈ సినిమా చేయి అని చెప్పాడట. దానితో బి గోపాల్ చేసేదేమీ లేక ఆ తర్వాత మోహన్ బాబు ను సంప్రదించడం , ఆయనకు ఈ కథ అద్భుతంగా నచ్చడంతో బి గోపాల్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా అసెంబ్లీ రౌడీ అనే పేరుతో రూపొందిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలా చిరంజీవి తన కెరియర్ లో అసెంబ్లీ రౌడీ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ మూవీ ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.