మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుష్క గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో అనుష్క తన నటనతో అంతకు మించిన అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో ఆ తర్వాత ఈమెకు అనేక కమర్షియల్ సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో కూడా ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమె చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.
ఇక కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపించిన అనుష్క ఆ తర్వాత మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో , తన పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా తన మొదటి సినిమా కు ముందు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఈమె చెప్పుకొచ్చింది.
తాజాగా అనుష్క మాట్లాడుతూ ... నేను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ మూవీ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాను. ఇక నాకు సినిమా గురించి ఏమీ తెలియదు. పూరి జగన్నాథ్ నన్ను ఒక రోజు వచ్చి సినిమా ఆఫర్ ఉంది. మీ ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. దానితో ఉన్నాయి సార్ అని నేను ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను తీసి అతనికి ఇచ్చాను. దానితో అతను నవ్వుకొని సర్ప్రైజ్ అయ్యాడు. నాకు నిజంగా హీరోయిన్ కావాలి అనుకునే వారు ఫోటో షూట్ లను చేసి వాటిని ఇస్తారు అనే విషయం తెలియదు. అందుకే నేను అలా చేశాను అని అనుష్క చెప్పుకొచ్చింది.