నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన
కార్తికేయ 2,
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం.
కార్తికేయ (2014)కి సీక్వెల్, దీనిని
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.తాజాగా 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు లభించింది.2022
డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలలో బెస్ట్ చిత్రాలకు నేడు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా మన
కార్తికేయ 2
సినిమా అవార్డు గెలుచుకుంది. తెలుగులో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన
కార్తికేయ 2
సినిమా పాన్
ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఆల్మోస్ట్ 130 కోట్ల కలెక్షన్స్ సాధించింది.ఇప్పుడు
కార్తికేయ 2 సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డుని ప్రకటించారు. ఈ
సినిమా డివోషనల్
థ్రిల్లర్ గా తెరకెక్కించగా ఇందులోని కృష్ణతత్వం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.ఈ చిత్రంలో
అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి గురించి చెప్పే సన్నివేశానికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.ఈ
సినిమా జాతీయ అవార్డు రావడంపై
హీరో నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో వీడియో రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా
కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. నమస్తే అండి. నేను మీ నిఖిల్. ఇప్పుడే నేనొక అద్బుతమైన న్యూస్ విన్నాను. మన
సినిమా కార్తికేయ-2 నేషనల్ అవార్డు గెలుచుకుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే మీ ముందుకు వచ్చాను. ఈ
సినిమా ఇంత విజయం సాధించడానికి ఈ అవార్డు రావడం కారణం మా ఎంటైర్ టీం.
నిర్మాత అభిషేక్ అగర్వాల్,
కృష్ణ ప్రసాద్, వివేక్ గారు.. అలాగే మై బ్రదర్,
డైరెక్టర్ చందూ మొండేటి, మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ.. అదే విధంగా మా డీవోబీ కార్తీక్ ఘట్టమనేకి అందరికి థ్యాంక్స్ చెప్పాలి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లకు అందరు చూసిన
సినిమా ఇది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైన మా సినిమాకు ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ ఆడియన్స్కి ధన్యవాదాలు. అలాగే మా సినిమాను నేషనల్ అవార్డుకు ఎన్నిక చేసిన కౌన్సిల్కి కూడా థ్యాంక్యూ అని వీడియోలో చెప్పుకొచ్చాడు.మరోవైపు అవార్డు వచ్చిన ఆనందం లో పార్ట్ -3చేయనున్నట్లు
మూవీ యూనిట్ ప్రకటించింది.