ఖడ్గం సీక్వెల్ పై కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali krishna
స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ అప్పట్లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. దేశభక్తి కథాంశంగా వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, కీలక పాత్రలు పోషించగా.. సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. దేశభక్తి గురించి తెరకెక్కించిన కొన్ని సీన్లు అప్పట్లో ఓ రేంజ్‌లో హైలెట్ అయ్యాయి. ఈ సినిమా పాటలు ఇప్పటికీ సినీ లవర్స్ చెవుల్లో మార్మోమోగుతూనే ఉంటాయి.డైరెక్టర్ కృష్ణవంశీ.. కెరీర్ స్టార్టింగ్ ‘గులాబి’ నుండి విభిన్నకథాంశాలతో సినిమాలు చేస్తూ.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ‘నిన్నేపెళ్లాడతా’, ‘సింధూరం’, ‘చంద్రలేఖ’, ‘అంతపురం’.. ఇలా లవ్, ఫ్యామిలీ, నక్సలిజం, ఫ్యాక్షన్ లాంటి బ్యాక్‌డ్రాప్‌లతో చిత్రాలు తెరకెక్కించి ఆకట్టుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌కి స్ట్రాంగ్ పిల్లర్ వేసిన ఫిలిం ‘మురారి’.. సూపర్ నేచురల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ తర్వాత.. దేశ భక్తి కధాంశంతో ‘ఖడ్గం’ తీశారు. కృష్ణవంశీ చేసిన అత్యుత్తమ దేశ భక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘ఖడ్గం’.మాస్ మహారాజా రవితేజ, వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, జూబ్లీ స్టార్ శ్రీకాంత్ లాంటి హీరోలు కనిపించిన మల్టీస్టారర్ ఇది. సంగీత, సోనాలీ బింద్రే, కిమ్ శర్మ ఫీమేల్ లీడ్స్.. ఉత్తేజ్, బ్రహ్మాజీ, షఫీ, ఆహుతి ప్రసాద్, పావలా శ్యామల, రఘుబాబు, ఎమ్.ఎస్.నారాయణ కీలకపాత్రల్లో నటించారు.

కార్తికేయ క్రియేషన్స్ బ్యానర్ మీద సుంకర మధు మురళి నిర్మించిన ‘ఖడ్గం’ 2002 నవంబర్ 29న రిలీజ్ అయింది.దేశ భక్తి, లవ్, ప్యాషన్, ఎమోషన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ.. ఆద్యంతం ఆకట్టుకునేలా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా.. నిజ జీవితంలో మన చుట్టూ ఉండే మనుషుల్లాంటి క్యారెక్టర్లతో కృష్ణవంశీ రూపొందించిన ‘ఖడ్గం’ సూపర్ హిట్ అయింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే కోటి (రవితేజ), డ్రైవర్‌‌గా పనిచేసే అంజాద్ (ప్రకాష్ రాజ్), సిన్సియర్ అండ్ కేపబులిటీ గల పోలీస్ ఆఫీసర్ రాధ కృష్ణ (శ్రీకాంత్) పాత్రలతో ప్రేక్షకులు లీనమైపోతారు.

ఖడ్గం’ మొత్తం 5 నంది అవార్డులు.. 3 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకుంది.. అలాగే హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ లాంటి స్టార్లతో ‘ఇన్సాన్’ పేరుతో రీమేక్ అయింది. జాతీయ సమైక్యతా చిత్రంగా సరోజినీ దేవి అవార్డు (నిర్మాత మధు మురళి), ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కళా దర్శకుడు (పి. రంగారావు ), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ (కిషోర్), స్పెషల్ జ్యూరీ అవార్డ్ (రవితేజ) కేటగిరీల్లో నందులు వరించాయి.. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (సంగీత), బెస్ట్ విలన్ (షఫీ) కేటగిరీల్లో ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి..ఇదిలావుండగా తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కృష్ణవంశీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. 'మీ నుంచి ఖడ్గం లాంటి మూవీ కోసం వెయిటింగ్' అని ఓ నెటిజన్ అడగ్గా.. ఆసక్తికర సమాధానం ఇచ్చారు.పార్ట్-2 ల మీద నాకు నమ్మకం లేదండి. చేతకాదు.అందువల్ల ఖడ్గం 2 ఉండదు. కానీ సామాజిక సమస్యలపై చిత్రం ఉంటుంది అని బదులిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: