వావ్... మహేష్ స్టన్నింగ్ లుక్ అదిరిపోయిందిగా..!!

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ చేయబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీని గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజ‌మౌళి కాంబినేష‌న్ మూవీపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొన్న సంగతి తెలిసిందే. ఈసారి పాన్ ఇండియా కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్‌ నే ఢీకొడుతున్నార‌ని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. ద‌క్షిణాఫ్రికా అడవుల్లో సాగే ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ మూవీ ఇద‌ని, కామెరూన్ తెర‌కెక్కించిన 'ఇండియానా జోన్స్' లైన్‌లో ఆద్యంతం థ్రిల్ కి గురి చేస్తుంద‌ని ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్రసాద్ ఇప్ప‌టికే స్ప‌ష్ఠ‌త‌నిచ్చారు.ఈ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ స్వింగ్ లో ఉంది. వ‌ర్క్ షాప్ లు పూర్త‌య్యాయి. ఈ నెలాఖ‌రు లేదా వ‌చ్చే నెల‌లో సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే ఇంత‌లోనే సూప‌ర్ స్టార్ మ‌హేష్ జైపూర్ (రాజ‌స్థాన్‌) ట్రిప్ లో క‌నిపించారు. ఆయ‌న మేకోవ‌ర్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లోకి లీక‌య్యాయి. ఈ లీక్డ్ ఫోటోల్లో మ‌హేష్ లుక్ నిజంగా అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.మ‌హేష్ కొత్త సినిమాలో పూర్తిగా లాంగ్ హెయిర్ స్టైల్ తో క‌నిపించ‌నున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇది ఒక ర‌కంగా ప్రీలుక్ అని భావించాల్సి ఉంది. ప‌ర్ఫెక్ట్ ఫిట్ రూపం కోసం మ‌హేష్ జిమ్ లో నిరంత‌రం క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఇప్ప‌టికే బాడీ షేప్‌లు మారాయి. స్లిమ్ లుక్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. అలాగే త‌న‌ గిర‌జాల జుత్తుకు పోనీ టెయిల్ ముడి వేసి ఉంది. బాగా పెరిగిన గ‌డ్డం మీస‌క‌ట్టుతో అత‌డి రూప‌మే పూర్తిగా మ్యాన్లీగా మారిపోయింది. సింపుల్ టీష‌ర్ట్- డెనిమ్స్ లో ఈ కొత్త రూపం నిజంగా ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్ అన‌డంలో సందేహం లేదు.నిజానికి ఒక అంతర్జాతీయ స్టార్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ మ‌హేష్ లో ఉన్నాయి. ఇప్పుడు త‌న ఫేవ‌రెట్ టామ్ క్రూజ్ తో పోటీప‌డే సాహ‌స‌విన్యాసాల‌ను అత‌డు ప్ర‌ద‌ర్శించాల్సి ఉంటుంది. ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండార్డ్ ఉన్న న‌టుడు భార‌త‌దేశం నుంచి టాలీవుడ్ కేరాఫ్ గా పుట్టాడంటూ మ‌హేష్ గురించి చ‌ర్చ జ‌ర‌గాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. జ‌క్క‌న్న నుంచి అప్ డేట్ కోసం ఇప్పుడు అంద‌రూ వెయిటింగ్. ఈ ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వం కానుక‌గా మ‌హేష్ - రాజ‌మౌళి టీమ్ నుంచి అప్ డేట్ వ‌స్తుంద‌ని ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: