మురారి రీరిలీజ్ : థియేటర్ లో పెళ్లి.. ఘాటుగా స్పందించిన కృష్ణవంశీ..!!

murali krishna
స్టార్ హీరోల బ‌ర్త్‌డేని ఫ్యాన్స్ ఎంత గ్రాండ్‌గా జ‌రుపుకుంటారో మ‌నం చూస్తూనే ఉన్నాం. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ‌ర్త్ డే కావ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల‌లో సంబురాలు అంబరాన్నంటాయి. మ‌రోవైపు మ‌హేష్ బాబు బర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్‌లోనే క్లాసిక్ మూవీ అయిన మురారి రీరిలీజ్ జ‌రిగింది. దీంతో థియేట‌ర్స్‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెలకొంది. థియేట‌ర్స్ ముందు తెగ ర‌చ్చ చేస్తూ కేరింత‌లు కొడుతూ నానా హంగామా చేస్తున్నారు. అయితే కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.చిత్రంలో మ‌హేష్ బాబు త‌న న‌ట‌న‌తో ఎంతగానో ఆక‌ట్టుకున్నాడు. ఇక క‌థానాయిక‌గా న‌టించిన సోనాలి బింద్రే కూడా అద‌ర‌గొట్టింది. ఇప్పుడు మురారి మూవీ రీ రిలీజ్ తో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.2001లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా టాలీవుడ్ నుంచి వ‌చ్చిన‌ ఆల్ టైం క్లాసిక్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది.అయితే అభిమానులు ఈ మూవీ చూస్తుండ‌గా.. ఒక ప్రేమ జంట థియేట‌ర్‌లోనే పెళ్లి చేసుకుంది. థియేట‌ర్‌లోకే తాళిబొట్టును తీసుకువచ్చిన వరుడు మహేష్ అభిమానుల ముందే పెళ్లి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది. అయితే ఈ ఘ‌ట‌న‌పై కొంద‌రు స‌పోర్ట్ చేస్తుండ‌గా.. యువ‌త ఏంటి ఇలా మారిపోతుంద‌ని కామెంట్లు పెడుతున్నారు.అయితే మురారి 4K సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది.

ట్రెండ్ అంటే కలెక్షన్స్ అనుకునేరు… మహేష్ సినిమాకు అవి ఎలాగో బాగా వస్తాయన్న సంగతి తెలిసిందే. మురారి కి ఏ సినిమాకు జరగని విధంగా అభిమానులు థియేటర్లలో అక్షింతలు పంచుతూ .. పెళ్లి సాంగ్ రాగానే స్క్రీన్ పైకి విసిరారు. ఇక్కడ వరుకు బాగానే ఉంది. విజయవాడ అలంకార థియేటర్లో ఒక యువ జంట చందామామా పాట ప్రదర్శన సమయంలో పెళ్లి చేసుకున్నారు. అభిమానుల కేరింతల నడుమ అబ్బాయి అమ్మాయికి తాళి కట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. స్టేడియం లో ప్రపోస్ చేయడం, మాల్స్ లో ప్రపోజ్ చేయడం చూసాం ఇప్పటివరకు. థియేటర్లో పెళ్లి చేసుకుని కొత్త ట్రెండ్ సృష్టించారు.పెళ్లి చేసుకున్న అబ్బాయి అమ్మాయి మహేష్ బాబు ఫ్యాన్స్ కావడం విశేషం. మురారి 4K సుమారు 2. కోట్ల రూపాయిల అడ్వాన్స్ సేల్స్ తోనే వసూలు చేసింది. ఆదివారం వరుకు చాలా చోట్ల మంచి బుకింగ్స్ ఉన్నాయి. సుమారు 5 కోట్ల వరుకు వసూల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.ఈ నేపథ్యంలో థియేటర్లో పెళ్లి పై కృష్ణవంశీ ఘాటుగా స్పందించారు. ఇది మంచి పద్ధతి కాదు మన సంస్కృతి, సాంప్రదాయాలను,అవమానించడమే. అలాంటివి మళ్లీ రిపీట్ చేయవద్దు అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.మొత్తానికి మహేష్ బర్త్డే కి మురారి రూపం లో మహేష్ ఫాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. కొత్త సినిమా అప్డేట్ లేదనే బాధను మర్చిపోయేలా చేసింది బాబు మురారి… రాజమౌళి తో సినిమా రెండేళ్లు పడుతుంది కాబట్టి అతడు, ఖలేజా కూడా రాబోయే సంవత్సరాల్లో రి రిలీజ్ ప్లాన్ చేసే ఆలోచనల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: