ఆ క్షణంలో.. చైతు ఎంతో బాధపడ్డాడు : నాగార్జున

frame ఆ క్షణంలో.. చైతు ఎంతో బాధపడ్డాడు : నాగార్జున

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. అదే ఇటీవల అక్కినేని హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం గురించి. 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంతను ప్రేమ పెళ్లిచేసుకున్నాడు నాగచైతన్య. ఎన్నో ఏళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. పెళ్లితో ఒకటైంది అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఎక్కడ చూసినా కూడా వీరిద్దరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. టాలీవుడ్ లోనే మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు.

 ఇక వీళ్ళ మధ్య అన్యోన్యత చూసి అభిమానులు కూడా తెగ మురిసిపోయేవారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని రోజులపాటు రూమర్లు వచ్చాయి. ఈ రూమర్లు నిజం కాకపోవచ్చు అని అభిమనులు అనుకున్నారు. కానీ ఆ తర్వాత సమంత నాగచైతన్య నిజంగానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.  ఆ తర్వాత కొన్నాళ్లపాటు సింగిల్ గానే ఉన్నా నాగచైతన్య.. ఇక ఇప్పుడు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అక్కినేని కుటుంబానికి సరిపడే ఫ్యామిలీ శోభితాది కాకపోయినప్పటికీ తనతో హ్యాపీగా ఉంటాను అని నమ్మిన చైతన్య చివరికి ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. ఇటీవల నిశ్చితార్థం ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగచైతన్య తండ్రి నాగార్జున ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగచైతన్య సమంత విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంతతో విడాకులు అనంతరం నాగచైతన్య ఎంతో బాధపడ్డాడు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చైతు -  శోభిత నిశ్చితార్థంతో తాము సంతోషంగా ఉన్నాం అంటూ తెలిపాడు. విడాకుల అనంతరం చైతు తన బాధను ఎవరితో పంచుకోలేదు. కానీ ఇప్పుడు తన కొడుకు సంతోషంగా ఉండడం చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: