నాగ చైతన్య, శోభిత దూళిపాల ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వెంటనే వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. నేను శోభిత ధూళిపాల నాగచైతన్య జాతకం ఎలా ఉండబోతుందో రేపు చెబుతాను అంటూ సంచలన అనౌన్స్మెంట్ ఇచ్చారు. దీంతో అందరికీ వేణు స్వామి ఏం చెబుతారు అని ఆసక్తి నెలకొంది.అయితే ఎట్టకేలకు వేణు స్వామి నాగచైతన్య శోభిత ధూళిపాల జాతకం మొత్తం చెప్పేశాడు. ఇందులో భాగంగా శోభితతో కూడా నాగచైతన్య ఎక్కువ రోజులు కలిసి ఉండరని 2027 వరకే వీరి బంధం బాగుంటుందని,ఆ తర్వాత వీరి బంధం బాగుండదని వీరిద్దరి మధ్య ఓ స్త్రీ కారణంగా గొడవలు వస్తాయని కరాకండిగా చెప్పేశారు. అంతేకాకుండా నాగచైతన్యతో వైవాహిక బంధం శోభిత కంటే సమంతకే చాలా బాగుందని, నాగచైతన్య సమంత ల బంధానికి 50% బాగుంటే, నాగచైతన్య శోభితల వైవాహిక బంధానికి కనీసం 10% కూడా లేదని,50% ఉండే నాగచైతన్య సమంతలే విడిపోయారు.
మరి శోభిత చైతూల మధ్య బంధం 10% మాత్రమే ఉంది.వీరిద్దరికి కూడా గొడవలు అవుతాయి.అయితే వీరి జాతకాల ప్రకారం నేను వీరికి జరగబోయేది చెప్పాను. ఈ విషయంలో నన్ను ఎవరు ఎన్ని ట్రోల్ చేసుకున్నా జాతక మాత్రం మార్చలేరు. అలాగే వీరి జీవితంలో నేను చెప్పిన జాతకం జరగకూడదని 100% కోరుకుంటాను. వీరు ఎప్పటికీ కలిసి ఉండాలని భావిస్తాను.. అంటూ వేణు స్వామి సంచలన జోస్యం చెప్పారు.అయితే వేణు స్వామి మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామందిని నెటిజన్స్ నాగచైతన్య రెండు పెళ్లిళ్లతో ఆగిపోడా..మూడో పెళ్లి కూడా చేసుకుంటారా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఎందుకంటే గతంలో నాగచైతన్య సమంత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వారి మధ్య ఓ స్త్రీ కారణంగా గొడవ జరిగి విడిపోతారు అని వేణు స్వామి చెప్పారు.
అలా ప్రస్తుతం ఎంగేజ్మెంట్ అయిన శోభిత ధూళిపాల కారణంగానే సమంత నాగచైతన్య బంధం తెగిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. అయితే తాజాగా వీరి ఎంగేజ్మెంట్ తర్వాత కూడా అప్పుడు ఎలా అయితే జాతకం చెప్పానో ఇప్పుడు కూడా సేమ్ అలాగే నాగచైతన్య శోభిత బంధం ఓ స్త్రీ కారణంగా చెడిపోతుందని అన్నారు. అలా వీరి పెళ్లయ్యాక కూడా నాగచైతన్య శోభితల మధ్య వేరే ఎవరైనా స్త్రీ రావడం వల్ల వీరి మధ్య బంధం తెగిపోతుంది కావచ్చు అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అలా శోభితతో బంధం చెడిపోతే నాగచైతన్య మూడో పెళ్లి కూడా చేసుకుంటారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి వేణు స్వామి ఇప్పటినుండి నేను ఎవరి పర్సనల్ విషయాలు, జాతకాలు చెప్పను అని అందరికీ మాట ఇచ్చి మళ్లీ తన జాతకాలు చెప్పడం మొదలుపెట్టారు