'ఓజీ' షూటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ లోకి అడుగుపెట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే ఇంతకాలం ఎన్నికల హడావిడి ఉండడంతో ఆయన ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి.  గతంలో ఆయన ఒప్పుకున్న సినిమాలు కొన్ని షూటింగ్ సగం వరకు చేసి ఆపేశారు. మిగిలిన షూటింగ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే

 ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్లీ షూటింగ్స్ యధావిధిగా కంటిన్యూ చేస్తారా అన్న డైలమాలో పడ్డారు ఆయన అభిమానులు. పవన్ డిప్యూటీ సీఎం కాకముందు మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇక ఆ మూడు సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక వాటిలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన OG( ఒరిజినల్ గ్యాంగ్ స్టార్) ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సీన్స్ కు సంబంధించి కేవలం పది రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇందుకోసమై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు ‘OG’ నిర్మాత dvv దానయ్య.

 అక్టోబరు నుండి షూటింగ్ లో పాల్గొంటానని అందుకుకోసం ఏర్పాట్లు చేసుకోమని నిర్మాతకు హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆ పనుల్లో వున్నారు దానయ్య. అక్టోబరు నుండి అటు రాజకీయాలు, సినిమాలు రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు పవర్ స్టార్. మరోవైపు హార హార వీరమల్లు నిర్మాత AM. రత్నం కూడా పవన్ కళ్యాణ్ ను కలవగా ముందు OG ముగించి, పరిపాలన పరంగా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుని షూటింగ్ లో పాల్గొంటానని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా అప్పుడెప్పుడో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టార్ట్ చేసి ఆపేసాడు. మరి పవన్ ఈ సినిమాను స్టార్ట్ చేస్తారో లేదో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: