డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ ఏకంగా అన్ని కిలోలు తగ్గడా..?

murali krishna
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ చిత్రీకరణ సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన విజయం అందుకోలేని పూరి జగన్నాథ్ ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఉద్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.అందుకు అనుగుణంగానే డబుల్ ఇస్మార్ట్‌డ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రదర్శించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇందులో భాగంగానే బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్ ని ఈ సినిమాలో నటింప చేశారు. కాగా ఈ ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హీరో రామ్.. విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు.సరిగ్గా వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. మాములుగానే హిట్టయిన సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుందంటే ఆడియెన్స్‌లో ఉండే ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. తొలిపార్టుతో ఊహించని రికార్డులు కొల్లగొట్టిన సినిమా.. సీక్వెల్‌తో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సృష్టిస్తుందని ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటారు.
అలా భారీ అంచనాలతో దిగుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఐదేళ్ల కిందట బాక్సాఫీస్‌ దగ్గర రికార్డుల మోత మొగించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఇది రీమేక్. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు ఆడియెన్స్‌లో క్రియేట్ చేసిన అంచనాలు అంతా ఇంతా కాదు.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లు చేస్తూ.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.ఇక రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వూలో.. రామ్ సినిమాకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా కోసం 18 కిలోలు తగ్గినట్లు రామ్ పోతినేని తెలిపాడు. తన లాస్ట్ సినిమా స్కంధలో రామ్ 86కిలోలు ఉండగా.. ఈ సినిమా కోసం 68కి వచ్చినట్లు చెప్పాడు. అంతేకాకుండా స్కంధ పూర్తికాగానే విధేశాలకు వెళ్లి వ్యాయామం చేసినట్లు శంకర్ లుక్‌లోకి వచ్చినట్లు తెలిపాడు. కాగా స్కంధ సినిమా గతేడాది ఆగస్టు నెలలో పూర్తయింది.ఇక ఈ సినిమా సెప్టెంబర్‌-అక్టోబర్ నెలలో స్టార్ట్ అయింది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే రామ్ పోతినేని 18 కిలోలు తగ్గాడు. నిజానికి ఇది మాములు విషయం కాదు. అయితే.. వ్యాయామంతో పాటు రాత్రి పూట కేవలం జ్యూ్స్‌లు మాత్రమే తాగేవాడని రామ్ సన్నిహితులు తెలిపారు. దీంతో హీరో డెడికేషన్ సూపర్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: