మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ చేంజర్ నుంచి మాస్ అప్డేట్..!!

frame మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ చేంజర్ నుంచి మాస్ అప్డేట్..!!

murali krishna
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ఫ్యాన్స్ అంతే నిరుత్సాహంలో కూడా ఉన్నారు ఈ సినిమాపై. సినిమా మొదలయి మూడేళ్లు అవుతున్నా ఎలాంటి అప్డేట్స్ లేవని ఇన్ని రోజులు ఎదురుచూసారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాని డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తారని ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.ఇన్ని రోజులు షూటింగ్ కూడా అవ్వలేదని బాధపడగా ఇటీవలే గేమ్ ఛేంజర్ షూట్ పూర్తయిందని సమాచారం. తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. గేమ్ ఛేంజర్ డబ్బింగ్ వర్క్ నేడు మొదలుపెట్టినట్టు ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. షూట్ అయిపొయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్స్ త్వరగానే పూర్తిచేసి డిసెంబర్ లో సినిమా రిలీజ్ పక్కా అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్.అయితే ఈ మూవీ డిసెంబరు లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే దిల్ రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. కాగా, ఇప్పటికీ ఈ సినిమా 10 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉందని, త్వరలోనే అది కూడా పూర్తి చేస్తామని శంకర్ టీం అప్ డేట్ కూడా ఇచ్చేసింది. ఇకపోతే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్ డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ అదేమిటంటే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ డబ్బింగ్ పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నయట. ఈ క్రమంలోనే.. మూవీ టీమ్ గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. అయితే ఇప్పటికే టీజర్ రిలీజ్ కోసం అన్ని విధాలుగా సన్నద్ధలు చేస్తున్నారని, త్వరలోనే టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం.ఇక ఈ విషయం పై ఇటు మోగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆ సాలిడ్ ట్రీట్ ను ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్, అంజలీ, కియారా అద్వానీ తో పాటు నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఇందులో రామ్ చరణ్ తండ్రీ, కొడుకు పాత్రలో నటించనున్నారట.డబ్బింగ్ వర్క్ మొదలుపెట్టిన ఫోటోలు షేర్ చేసి రిలీజ్ క్రిస్మస్ కి అని మరోసారి క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ చేయగా నెక్స్ట్ సాంగ్ ఆగస్టు చివర్లో వస్తుందని ఇటీవల థమన్ ఓ ప్రెస్ మీట్ లో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: