ఇది కదా అసలైన కిక్ అంటే.. పవన్ బర్త్ డే కి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ఓజీ టీం..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో  బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను చేపట్టిన పవన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అయితే ఈ పుట్టినరోజు మెగా కుటుంబానికే కాకుండా మెగా అభిమానులకి కూడా చాలా స్పెషల్. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు ఇది. అంతేకాదు ప్రస్తుతం పవర్స్టార్ పవన్ కళ్యాణ్

 డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. కాబట్టి ఇది పవన్ అభిమానులకు అదే విధంగా మెగా కుటుంబానికి కూడా చాలా ప్రత్యేకం. దీంతో ఇప్పటినుండే పవన్ పుట్టినరోజు ని ఏ స్థాయిలో సెలబ్రేట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఈ క్రమంలోనే పవన్ రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాల నుండి వాళ్ళు పోస్టర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం వినబడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా గత కొంతకాలంగా

 సినిమాలకి దూరంగా ఉన్న సంగతే మనందరికీ తెలిసిందే.. అయితే ఇటీవల తన సొంత నియోజక వర్గమైన పిఠాపురంలోని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ‘OG'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాను పూర్తి చేస్తానని, ఆ సినిమా చాలా బాగుంటుంది మీ అందరికి తప్పకుండ నచ్చుతుందని వ్యాఖ్యానించారు, దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఎప్పుడెప్పుడు OG షూట్ లో తమ అభిమాన హీరో పాల్గొంటాడా అని ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే షూట్ లో పాల్గొంటానని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని నిర్మాత DVV. దానయ్య కు పవర్ స్టార్ చెప్పినట్టు తెలుస్తుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ షూట్ లో జయిన్ అయితే షూట్ ఎక్కడ డిలే అవకుండా చకచక ఫినిష్ చేసేలా దర్శకుడు సుజిత్ అన్ని ఏర్పాట్లు ఫినిష్ చేసాడు. పవన్ బర్త్ డే తరువాత OG షూటింగ్ తిరిగి స్టార్ట్ కానుంది. దానితో పాటు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా OG షూటింగ్ తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది స్పెషల్ వీడియో రిలీజ్ చేయనుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: