విక్రమ్ : 'తంగలాన్' చూసాక ఆశ్చర్యపోవడం ఖాయం..!!

murali krishna
చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ఈ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. పా రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహనన్, పార్వతి కీలక పాత్రల్లో నటించారు. తంగలాన్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విక్రమ్‌కి మంచి మార్కెట్ ఉండటంతో ఇక్కడ కూడా గట్టిగానే ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్.ఈ కార్యక్రమంలో హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ “మీరు చూపిస్తున్న ఎనర్జీ, క్రేజ్ బంగారంలా అనిపిస్తోంది. తెలుగు సినీప్రియులు ఎంతో ప్రత్యేకం. మాకు మీ సపోర్ట్, ఎంకరేజ్ మెంట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తంగలాన్ టీజర్, ట్రైలర్ మీకు బాగా నచ్చాయని ఆశిస్తున్నా. మీరు నా గురించి, మా తంగలాన్ సినిమా చెప్పిన ప్రోత్సాహాన్నిచ్చే మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. తంగలాన్ వందేళ్ల క్రితం జరిగిన కథ. తంగలాన్ ఒక మంచి సినిమా. ఈ స్టేజీ మీద నా సినిమాల్లోని పర్ ఫార్మెన్స్ లు చూపించారు. అవన్నీ చూసినప్పుడు ఎమోషన్ అయ్యాను. ఇవన్నీ చేశానా అనిపించింది. ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే స్ఫూర్తి కలిగింది. రంజిత్ గారు నా డ్రీమ్ డైరెక్టర్. తంగలాన్ గురించి ఆయన చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. మీకు సర్ ప్రైజ్ గా ఉండాలని సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. ఇది నాకు దొరికిన ది బెస్ట్ రోల్ అని అనుకుంటున్నా. మీరు థియేటర్స్ కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కంటెంట్ తో కనెక్ట్ అవుతారు. మీరు తంగలాన్ కు చూపిస్తున్న రెస్పాన్స్ కు థ్యాంక్స్.సినిమా గురించి విక్రమ్‌ మాట్లాడుతుండగా 'ఆస్కార్‌.. ఆస్కార్‌' (విక్రమ్‌ నటనకు రావాలని ఆకాంక్షిస్తూ) అంటూ కేరింతలు కొట్టారు. ''నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌తో కలిసి రెండు సినిమాలు చేశా. ప్రయత్నిద్దాం'' అని విక్రమ్‌ నవ్వుతూ సమాధానమిచ్చారు. ''ఇది అన్ని భాషల వారికి కనెక్ట్‌ అయ్యే మూవీ. 'తంగలాన్‌' కొన్ని వందల ఏళ్లనాటి కథ. రంజిత్‌ దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అనివార్య కారణాల్ల ఇంతకాలం కుదర్లేదు. ఈ చిత్రం మీ అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. మాళవిక తన పాత్రలో ఒదిగిపోయేందుకు ఎంతో శ్రమించారు'' అని తెలిపారు. ఈ నెల 15న థియేటర్స్ లో కలుద్దాం” అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: