ఇన్నాళ్లకు బయటపడ్డ సాయి పల్లవి బ్యూటీ సీక్రెట్..!
ఇదిలా ఉండగా అవసరం అయితే తప్ప, మేకప్ కు దూరంగా ఉండే ఈమె ఖచ్చితంగా ఆ రెండు ప్రొడక్ట్స్ మాత్రం తీసుకెళ్తుందట. అవి లేకపోతే కనీసం బయటకు కూడా రాదట సాయి పల్లవి. అందుకే ఆ రెండు ప్రొడక్ట్స్ ఈమెను నాచురల్ గా మారుస్తున్నాయని సమాచారం.. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన మేకప్ కి సంబంధించిన విషయాలను పంచుకుంది. సాయి పల్లవి మాట్లాడుతూ.. నా బ్యాగ్ లో ఎప్పుడు కూడా రెండు మేకప్ వస్తువులుంటాయి. ఒకటి ఐలైనర్ , రెండోది మాయిశ్చరైసర్ క్రీమ్ తప్పకుండా నా బ్యాగ్ లో ఈ రెండింటిని నేను క్యారీ చేస్తాను. అయితే జుట్టుకు సంబంధించి పెద్దగా ఏ హెయిర్ స్టైల్ నేను వాడను అంటూ చెప్పుకొచ్చింది.
మొత్తానికి అయితే సాయి పల్లవి టాప్ బ్యూటీ సీక్రెట్ వెనుక ఉన్న విషయాలను తెలుసుకొని అమ్మాయిలు సైతం ఫాలో అవడానికి సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా పాత్రను బట్టి తనను తాను మరింత మార్చుకుంటున్న సాయి పల్లవి , తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈమె అందానికి ,నటనకి, డాన్స్ పెర్ఫార్మెన్స్ కి ప్రత్యేక అభిమానులు ఉన్నారనటంలో సందేహం లేదు.