పుష్ప 2 టైటిల్ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్..!!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఎప్పడెప్పుడు వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ఆగస్టు 15 నుంచి ఏకంగా డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడటంతో చాలా మంది నిరాశ చెందారు. అయితే, అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలు అంటూ వచ్చిన పుకార్లతో డిసెంబర్‌లో అయినా ఈ చిత్రం వస్తుందా అనే భయం పట్టుకుంది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతూనే ఉంది. ఈ క్రమంలో పుష్ప 2 సినిమా నుంచి వచ్చిన తొలి సాంగ్ ‘పుష్ప.. పుష్ప’ తాజాగా మరో మైలురాయి దాటింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూలై 30) వెల్లడించింది.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఇప్పటికే అభిమానులను ఎంతగానో అలరించింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ సాగే పాటను పాన్ ఇండియా బాషల్లో మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. సాంగ్ ఎలక్ట్రి ఫైయింగ్ గా ఉంది.
దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ను వేరే లెవెల్లో కంపోజ్ చేశారు. బన్నీ మాస్ స్వాగ్ ను వేరే లెవెల్ లో చూపించారు. ఈ ఒక్క పాటతో పుష్పరాజ్ రూలింగ్ ఎలా ఉండబోతుంది అనేది తెలియజేశారు. సాంగ్ లో విజువల్స్ బాగున్నాయి. బన్నీ డాన్స్ తనదైన మార్క్ తో ఆకట్టుకుంది. చివరిగా అస్సలు తగ్గేదేలే డైలాగ్ మరింత గా ఆకట్టుకుంది. ఇంతకాలం ఎదురు చూసిన బన్నీ ఫ్యాన్స్ కి ఇది మంచి ట్రీట్ అని చెప్పాలి.  ఈ సాంగ్ విడుదలైన అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది. అంతేకాదు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఈ సాంగ్ కి 2.5 మిలియన్స్ లైక్స్ రావడం విశేషం.పాన్ ఇండియా బ్లాక్‍బస్టర్ పుష్పకు సీక్వెల్‍గా వస్తున్న పుష్ప 2 చిత్రానికి తెలుగుతో పాటు హిందీలోనూ ఫుల్ హైప్ ఉంది.

ఈ సినిమా పాటల విషయంలోనే ఇది అర్థమవుతోంది. ‘పుష్ప.. పుష్ప’ సాంగ్‍ హిందీ లిరికల్ వీడియోకు యూట్యూబ్‍లో ఇప్పటి వరకు సుమారు 71 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో 58 మిలియన్ వ్యూస్ దక్కాయి. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ మంచి వ్యూస్ దక్కించుకుంది. మొత్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ సాంగ్ యూట్యూబ్‍లో ఇప్పడు 150 మిలియన్ల వ్యూస్ దాటింది.ఈ సినిమా టైటిల్ సాంగ్‌కు ఇంతటి స్థాయిలో ఆదరణ లభించడంపై అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ రికార్డ్ తో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.పుష్ప సాంగ్‍పై ఈ అప్‍డేట్‍తో పాటు రిలీజ్ డేట్‍ను కూడా మూవీ టీమ్ పేర్కొంది. డిసెంబర్ 6వ తేదీన ఈ చిత్రం వస్తుందని తెలిపింది. పుష్ప 2 మళ్లీ వాయిదా పడుతుందని ఇటీవల వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది. అయితే, ఈసారైనా రిలీజ్ పక్కానే కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎలాగైనా డిసెంబర్‌ 6న రిలీజ్ చేయాలని, చాలా వేచిచూస్తున్నామంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: