మిస్టర్ బచ్చన్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్.. మాస్ డైలాగ్స్ తో రవితేజ అదరగొట్టాడుగా..!!

murali krishna
'షాక్‌', 'మిరపకాయ్‌' లాంటి సినిమాల తర్వాత మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్‌ హరీష్ శంకర్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం మిస్టర్‌ బచ్చన్‌.టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో పోలిస్తే టీజర్ వేరే లెవల్లో ఉంది. ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ట్రీట్ అదిరిపోయింది. ఇక రవితేజ మరోసారి తన యాక్షన్, నటనతో అదరగొట్టేశారు. ఇక టీజర్ మొత్తం ఓ డైలాగ్ మాత్రం గట్టిగానే పేలింది.టీజర్‌లో చిరంజీవి పాటతో మొదలు పెడుతామనే ఫిమేల్‌ వాయిస్‌తో మొదలవుతుంది. ప్రస్తుతం కాకుండా 90's బ్యాక్‌డ్రాప్‌లో స్క్రీన్‌ప్లే చూపించారు. టీజర్‌ను హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌, రొమాన్స్‌తో మొదలైంది. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య ఉండే రొమాంటిక్‌ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత టీజర్‌ను ఒక్కసారిగా సీరియస్‌ మోడ్‌లోకి వెళ్లింది. ఓ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ విలన్‌కు ఫోన్‌ చేసిన రైడ్‌ చేస్తున్నట్టు ఇన్‌ఫాం చేయడం.. "ఈ దేశాన్ని పీడుస్తుంది దరిద్రం కాదు సర్‌ నల్లధనం" రవితేజ చెప్పిన డైలాగ్ ఆసక్తిని పెంచుతుంది. విలన్‌కు ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్‌ కాల్‌ చేయడం.. ఆ తర్వాత రవితేజ ఐటీ ఆఫీసర్‌గా కనిపించడం మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. ఆ తర్వాత నాలుగైదు రైడ్‌లు చేయగానే కెరీర్‌లో సక్సెస్‌ వచ్చింది.. దాంతో కళ్లు నెత్తిమీదకు.. తల తాటి చెట్టుమిదకు ఎక్కినట్టు ఉంది అంటూ విలన్ హీరోని ఉద్దేశించి డైలాగ్ అంటుండగా.. ఐటీ ఆఫీసర్‌గా రవితేజను చూపించిన తీరు ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి.అలాగే ఆ తర్వాత కామెడీ సీన్స్ , యాక్షన్ సిక్వెన్సెస్ , రవి తేజ మాస్ డైలాగ్స్ అన్ని సమపాళ్లలో చూపించి.. మూవీ మీద టోటల్ హైప్ క్రియేట్ చేసినట్టు ఉంది. ఇక రవి తేజ, జగపతి బాబు మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పి తీరాలి. దీనిని బట్టే చెప్పేయొచ్చు. ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తుందని.ప్రేక్షకుల అంచనాలు తగ్గట్టుగానే మూవీని అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించినట్టు టీజర్‌ చూస్తే అర్థమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: