ప్రమోషన్స్ ఫుల్.. బజ్ నిల్.. శిరీష్ చేసిన మిస్టేక్ అదేనా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో అల్లు శిరీష్ ఒకరు. ఈయన గౌరవం అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈయన కమర్షియల్ సినిమా ద్వారా కాకుండా వైవిధ్యమైన సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ అయ్యాడు. పర్వాలేదు అనే అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇకపోతే ఈయన ఇప్పటికే అనేక సినిమాలలో నటించగా అందులో పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ద్వారా ఈయనకు మంచి విజయం అందింది.

ఈ మూవీ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు బుడ్డి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను ఆగస్టు 2 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను చాలా జోరుగా నిర్వహిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను శిరీష్ చాలా జోరుగా నిర్వహిస్తున్న ఈ మూవీ కి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఏర్పడడం లేదు. దానికి ప్రధాన కారణం ఈ సినిమా తమిళ్ లో ఆర్య హీరోగా రూపొందిన టెడ్డీ అనే మూవీ కి రీమేక్ గా రూపొందింది అనే వార్తలు రావడమే.

ఇక టెడ్డి సినిమా తెలుగు లో ఇప్పటికే విడుదల అయ్యింది. దానితో మళ్లీ శిరీష్ ఎందుకు ఈ మూవీ ని రీమిక్ చేశాడా అని అనుమానాలు ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమా నిజంగానే తమిళ సినిమా టెడ్డీ కి రీమేక్ గా రూపొందిందా ... లేక కొత్త కథతో రూపొందిందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమాకు ప్రమోషన్లు చేసిన చేయకపోయినా మూవీ విడుదల అయిన తర్వాత మంచి టాక్ వస్తే మాత్రం మంచి కలెక్షన్లను రాబట్టే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: