రెండోసారి తల్లి కాబోతున్న నటి ప్రణిత..!

Anilkumar
తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ నటి ప్రణిత సుభాష్ త్వరలోనే రెండోసారి తల్లి కాబోతున్నారు. ఇప్పటికే ఒక కూతురు ఉన్న ప్రణిత, తన రెండో ప్రెగ్నెన్సీని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలిసి ప్రేక్షకులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ప్రణిత తన భర్త నితిన్ రాజుతో కలిసి కొన్ని ఫోటోలు పోస్ట్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ప్రణిత తన రెండో ప్రెగ్నెన్సీ గురించి తెలిపిన తర్వాత నుంచి ఆమెకు సంబంధించిన ప్రతి విషయం మీడియాలో హాట్

 టాపిక్‌గా మారింది. ఆమె తీసుకునే ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె భర్తతో కలిసి తీసుకున్న ఫోటోలు కూడా అదే రీతిలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ప్రణిత తన బేబీ బంప్‌ను చూపిస్తూ పోజులిచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రణిత సుభాష్ కన్నడ చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆమె నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రణిత తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన కెరీర్‌తో పాటు తన

 వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాలో ఎంతగానో చర్చనీయాంశంగా మారుతుంది. కాగా ప్రణిత తన తాజా ఫోటోలను పోస్ట్ చేయగానే ఆమె అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె కొత్త జీవితానికి అన్ని విధాలుగా శుభాకాంక్షలు చెప్పారు. కొంతమంది ఆమె అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. మరికొందరు ఆమె త్వరలోనే ఆరోగ్యంగా కుమారుడిని జన్మనియాలి అని కోరుకున్నారు. ఇక ఇది కాసేపు పక్కన పెడితే కరోనా సమయంలో పేదల కోసం ఆమె తనవంతు సాయం చేసి అందరి ప్రశంసలు పొందారు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుని ప్రణీత 2021లో వివాహం చేసుకున్నారు. వీరికి 2022 జూన్‌లో పండంటి ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: