కే జి ఎఫ్ స్టార్ తో శృతిహాసన్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ కూతురిగా సినీ ప్రపంచానికి పరిచయమైన శృతిహాసన్ హీరోయిన్ గా మారి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన ఆమె హిందీలో వచ్చిన లక్ అనే సినిమాతో హీరోయిన్ అయింది. 2009లో రిలీజ్ అయిన సినిమా పెద్దగా ఆమెకు గుర్తింపు తీసుకురాలేద. తర్వాత తెలుగులో ఆమె అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో పరిచయం అవగా తమిళంలో సెవెంత్ సెన్స్ సినిమాతో పరిచయమైంది. నిజానికి ఆమె కెరియర్

 మొదట్లో చేసిన చాలా సినిమాలు దారుణమైన డిజాస్టర్లుగా నిలిచాయి. కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసలో ఉంటుంది శృతిహాసన్. శృతి హాసన్ ఓ సినిమా అంగీకరించిందంటే, అది పెద్ద సినిమా అని అర్థం. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రాజెక్ట్ అని అర్థం. ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్ “కూలీ”లో నటించనుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న “కూలీ” చిత్రంలో ఆమె రజనీకాంత్ కుమార్తెగా కనిపించనుంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న “సాలార్ 2”లో కూడా ఆమె

 మెయిన్ హీరోయిన్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ముద్దుగుమ్మ మరో పెద్ద సినిమాకు సైన్ చేసింది. కేజీఎఫ్ ఫేమ్ యష్ సరసన నటించనుంది శృతిహాసన్. తాజా సమాచారం ప్రకారం, యష్ సినిమాలో శృతిహాసన్ ఓ కీలక పాత్ర పోషించబోతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన 'టాక్సిక్' ఇందులో యష్ డాన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే షాంతను ప్రేమలో పడిన శృతి లాక్ డౌన్ మొత్తం అతనితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చేది. ఇప్పుడు అతనికి కూడా దూరమైన ఆమె సినిమాలో ఎంపిక విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటుంది. ఒకప్పుడు కథకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా కాంబినేషన్లు, రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉండే ఆమె ఇప్పుడు కంటెంట్ కి పెద్దపీట వేస్తోంది. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: