మరోసారి ఐటమ్ సాంగ్ తో దుమ్ము దులిపిన తమన్నా...!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. చేతినిండా ఆఫర్లతో తెలుగులోనే కాకుండా హిందీలో కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. కేవలం సినిమాలతోనే కాకుండా ఓటిటిలో పలు వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. ఒకవైపు హీరోయిన్ గా మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. అయితే గత కొంతకాలంగా తమన్న ఐటమ్ సాంగ్స్ సైతం చేస్తోంది. తమన్నా ఐటెం సాంగ్ చేసిందంటే ఆ చిత్రానికి తప్పుకున్నా ఎక్స్ట్రా మైలేజి వస్తుంది. ఏమన్నా గ్లామర్

 అంటే యువత అంతలా ఎగబడతారు. అల్లుడు శీను, జై లవకుశ, గని చిత్రాల్లో తమన్నా ఐటెం నంబర్స్ చేసింది. గత ఏడాది రజనీకాంత్ జైలర్ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్, చిన్న పాత్రలో ఊపు ఊపేసింది.  జైలర్ చిత్రానికి అంతలా హైప్ వచ్చిందంటే తమన్నా స్పెషల్ సాంగ్, అందులో ఆమె డ్యాన్స్ ప్రభావం కూడా ఉంది. తాజాగా తమన్నా మరో ఐటెం సాంగ్ తో వచ్చేసింది. రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్ నటిస్తున్న స్త్రీ 2 చిత్రం ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.   స్త్రీ లో బీటౌన్ బ్యూటీ నోరా ఫతేహి స్పెషల్ సాంగ్

 చేయగా.. ఇప్పుడు ఆ సీక్వెల్‌లో తమన్నా భాటియాకు అవకాశం వచ్చింది. అమర్ కౌశిక్ 'స్త్రీ 2' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరించగా.. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఆరేళ్ల క్రితం స్త్రీ సూపర్ హిట్ కావడంతో స్త్రీ 2పై మరింత హైప్ పెరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచగా.. ఇప్పుడు విడుదలైన స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ రాబట్టింది. గతంలో జైలర్ లోని తమన్నా చేసిన కావాలయ్యా పాట కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: